ప్రయివేటీకరించినా.. బీపీసీఎల్ గ్యాస్ సబ్సిడీపై గుడ్‌న్యూస్
పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(BPCL)ను విక్రయిస్తోంది. BPCL ప్రయివేటీకరణ తర్వాత వంటగ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ లభిస్తుందా? అనే ఆందోళనలు ఉన్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇన్వెస్టర్లకు స్పష్టం చేసింది. అర్హులకు సబ్సిడి గ్యాస్ సిలిండర్ ఏడాదికి 12 ఇస్తుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కలిగించే ప్రకటన వచ్చింది.

సబ్సిడీలో మార్పులేదు
BPCL ప్రయివేటీకరణ తర్వాత కూడా వంట గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ లభిస్తుందని తెలిపింది. నిర్వహణలో మార్పు వచ్చిన తర్వాత కూడా ప్రస్తుత వ్యవస్థలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. అంటే ప్రయివేటీకరణ తర్వాత వంట గ్యాస్ కస్టమర్ల బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీ అందుతుంది. BPCL ప్రయివేటీకరణ నేపథ్యంలో పలువురు ఇన్వెస్టర్లు ప్రభుత్వంతో వంట గ్యాస్ సబ్సిడీ అంశాన్ని లేవనెత్తుతున్నారు.

ఆ తర్వాత సబ్సిడీ అమౌంట్
BPCLలో ప్రభుత్వం తన వాటాను విక్రయించిన అనంతరం కొత్త యాజమాన్యం సబ్సిడీ మొత్తాన్ని భరించాలా అని ఇన్వెస్టర్లు అడుగుతున్నారు. ప్రస్తుతం కంపెనీ సబ్సిడీ మొత్తాన్ని భరిస్తోందని, ఆ తర్వాత చమురు కంపెనీలకు ప్రభుత్వం ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రయివేటీకరణ తర్వాత కూడా ఇదే వ్యవస్థ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఈ కంపెనీలకు సబ్సిడీ లేదు
రిలయన్స్, నయారా ఎనర్జీ వంటి ప్రయివేటురంగ చమురు కంపెనీలు కూడా వంట గ్యాస్‌ను విక్రయిస్తున్నాయి. వీటికి ఎలాంటి సబ్సిడీ లేదు. మార్కెట్ ధర వద్ద వంట గ్యాస్ కొనుగోలు చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం సబ్సిడీ కోసం కేంద్రం రూ.40,915 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.38,569 కోట్లుగా ఉంది. అంటే ఈ ఆర్థిక సంవత్సరం 6 శాతం ఎక్కువ కేటాయించారు. ఇందులో రూ.37,256.21 కోట్లు ఎల్బీజీ సబ్సిడీకి కేటాయించారు. అయితే మొదటి త్రైమాసికంలో ప్రభుత్వం రూ.1900 కోట్లను ఉపసంహరించుకుంది.


Click it and Unblock the Notifications