Stock Market: ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా మంగళవారం మార్కెట్లు మూసివేయబడ్డాయి. అందువల్ల నేడు ఎలాంటి ట్రేడింగ్ కార్యకలాపాలు ఉండవు.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ తన అధికారిక వెబ్‌సైట్ లో ఉన్న సెలవుల జాబితా ప్రకారం నేడు మార్కెట్లు సెలవులో ఉండనున్నాయి. 2023 సెలవుల లిస్ట్ ప్రకారం ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఎలాంటి ట్రేడింగ్ ఉండబోదని ఇన్వెస్టర్లు గమనించాలి. కాబట్టి ఈక్విటీలు, ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్, SLB విభాగంలో ట్రేడింగ్ ఉండదు. ఇదే సమయంలో కరెన్సీ-డెరివేటింగ్, కమోడిటీ డెరివేటివ్స్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ ట్రేడింగ్ కూడా ఉండదని గమనించాలి.

అయితే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉదయం షిఫ్ట్ సమయంలో కమోడిటీ డెరివేటివ్ సెగ్మెంట్‌లో ట్రేడింగ్ మూసివేయబడుతుంది. కానీ సాయంత్రం సెషన్ కోసం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.30 వరకు ట్రేడింగ్ చేసుకునేందుకు తెరచి ఉండనుంది. సెప్టెంబర్ నెలలో స్టాక్ మార్కెట్లకు వచ్చిన ఏకైక అదనపు సెలవుగా గణేష్ చతుర్థి మాత్రమే. దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు.. మహారాష్ట్రలో ఈ పండుగను ప్రజలు బాగా జరుపుకుంటారు.
2023 రానున్న నెలల్లో ఏఏ రోజులు స్టాక్ మార్కెట్లకు సెలవులు ఉన్నాయో గమనిస్తే.. అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మార్కెట్లకు రాబోతున్న సెలవు. ఇటీవల బీఎస్ఈ సెన్సెక్స్ వరుసగా 11 రోజుల ర్యాలీతో సూపర్ లాభాలను నమోదు చేయటంతో జీవితకాల గరిష్ఠ స్థాయి 67,838.63 వద్ద ముగిసింది. దీని తర్వాత సానుకూల స్థూల డేటా తరువాత నిఫ్టీ శుక్రవారం రికార్డు స్థాయిలో 20,192.35 వద్ద స్థిరపడింది.


Click it and Unblock the Notifications