రాష్ట్రాలకు రుణపరిమితి భారీగా పెంపు, ఉపయోగించుకుంది 14 శాతమే: నిర్మల

ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం (మే 17) రంగాలకు ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. ఈ రోజు ఏడు రంగాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఆదాయాలు కోల్పోయినట్లు చెప్పారు. 'కరోనా వల్ల కేంద్రంతో పాటు రాష్ట్రాలు రెవెన్యూ కోల్పోయాయి' అని ఆర్థికమంత్రి అన్నారు. రాష్ట్రాలను ఆదుకునేందుకు నిరంతరం అదనపు నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రాలకు అదనపు నిధులు.. రూ.46,038 కోట్లు విడుదల చేశాం

రాష్ట్రాలకు అదనపు నిధులు.. రూ.46,038 కోట్లు విడుదల చేశాం

కరోనా కారణంగా ఆదాయం కోల్పోయినందున రాష్ట్రాలను ఆదుకుంటామని, నిరంతరం అదనపు నిధులను విడుదల చేస్తామని నిర్మల చెప్పారు. రాష్ట్రాలు ఇబ్బందులు పడకుండా పన్నుల్లో వాటాను ఎప్పటికప్పుడు కేంద్రం విడుదల చేస్తూనే ఉంటుందని చెప్పారు. రాష్ట్రాల విపత్తు నిర్వహణ నిధుల కోసం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూనే ఉన్నామని చెప్పారు. ఏప్రిల్ నుండి రూ.46,038 కోట్లు రాష్ట్రాలకు విడుదల చేశామన్నారు.

ఇవి విడుదల చేశాం.. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం పెంచాం

ఇవి విడుదల చేశాం.. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం పెంచాం

రెవెన్యూ లోటు భర్తీ కోసం రూ.12,390 కోట్లు విడుదల చేశామని నిర్మల చెప్పారు. విపత్తు నిర్వహణ కోసం ఏప్రిల్ నెల నుండి రూ.46,038 కోట్లు రాష్ట్రాలకు విడుదల చేశామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ద్వారా రూ.11,092 కోట్లు విడుదల చేశామని, నిధుల కొరత కారణంగా రాష్ట్రాలకు ఆర్బీఐ ద్వారా నిధులు సమకూర్చినట్లు తెలిపారు. కేంద్ర విజ్ఞప్తిని మన్నించి ఆర్బీఐ రాష్ట్రాలకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం 32 రోజుల నుండి 50 రోజులకు పెంచిందని చెప్పారు. రాష్ట్రాలకు వేస్ అండ్ మీన్స్ పరిమితిని ఆర్బీఐ 60 శాతం పెంచిందన్నారు.

రాష్ట్రాలకు ఇచ్చిన రుణాల్లో 14% వినియోగించుకున్నాయి

రాష్ట్రాలకు ఇచ్చిన రుణాల్లో 14% వినియోగించుకున్నాయి

రాష్ట్రాల ఓవర్ డ్రాఫ్ట్ పరిధిని 14 రోజుల నుండి 21 రోజులకు ఆర్బీఐ పెంచినట్లు నిర్మల చెప్పారు. రాష్ట్రాలకు అందుబాటులోకి తెచ్చిన రుణాల్లో కేవలం 14 శాతమే వినియోగించుకున్నారన్నారు. రుణాలలో మరో 86 శాతం రాష్ట్రాలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ మొత్తం రాష్ట్రాలు వినియోగించింది పోను రూ.4.28 లక్షల కోట్లు రుణాల రూపంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాల రుణ పరిమితిని జీఎస్డీపీలో 3 శాతం నుండి 5 శాతానికి పెంచామని, రుణ పరిమితి పెంపు వల్ల రూ.4.28 లక్షల కోట్లు అదనంగా అప్పులు తెచ్చుకునే వెసులుబాటు ఉందన్నారు.

నేటి కొన్ని ప్రకటనలు

నేటి కొన్ని ప్రకటనలు

ఈ రోజు ప్రకటించిన వాటిలో... వైద్య సదుపాయాల ఏర్పాటుకు రూ.15వేల కోట్లు, రాష్ట్రాలకు రూ.4,113 కోట్లు, కిట్స్ టెస్టింగ్ ల్యాబ్ కోసం రూ.3750 కోట్లు, ఆరోగ్య సిబ్బందికి రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, పీపీఈ కిట్స్ విషయంలో 2 నెలలకు సరిపడా స్వయం సమృద్ధి, ఈ-సంజీవని టెలీ కన్సల్టేషన్ సేవలు ప్రారంభం, రాష్ట్రాలకు 51 లక్షల పీపీఈ కిట్స్ పంపిణీ, 87 లక్షల ఎన్ 95 మాస్కుల పంపిణీ, కంపెనీల చట్టంలో మార్పులు, డిజిటల్/ఆన్ లైన్ ఎడ్యుకేషన్ తదితర ప్రకటనలు చేశారు.

రూ.20 లక్షల కోట్లు కాదు.. దాదాపు రూ.21 లక్షల కోట్లు

రూ.20 లక్షల కోట్లు కాదు.. దాదాపు రూ.21 లక్షల కోట్లు

నేటి వరకు కేంద్రం రూ.20 లక్షల కోట్ల మొత్తాన్ని ప్రకటించింది. ప్రధాని మోడీ ప్రకటనకు ముందు రూ.1,92,000 కోట్లు. ప్రధాని మోడీ మంగళవారం (12వ తేదీ) మెగా ప్యాకేజీ ప్రకటన చేసిన మరుసటి రోజు నుండి నేటి (మే 17) వరకు వరుసగా ఐదు రోజులు ఆర్థికమంత్రి ప్యాకేజీపై ప్రకటన చేశారు. మొదటి రోజు రూ.కోట్లు, రెండవ రోజు రూ.3,10,000 కోట్లు, మూడవ రోజు రూ.1,50,000, నాలుగో రోజు మరియు 5వ రోజు కలిపి రూ.48,100 కోట్లు ప్రకటించారు. అంతకుముందు ఆర్బీఐ రూ.8,01,603 కోట్లు వ్యవస్థలోకి ఇన్ఫ్యూజ్ చేస్తున్నట్లు తెలిపింది. మొత్తం రూ.20,97,053 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. దాదాపు రూ.21 లక్షల కోట్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+