For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Penny Stock: మ్యాజిక్ చేసిన 11 పైసల స్టాక్.. లక్షను రూ.43 కోట్లుగా మార్చేసింది..

|

Multibagger Stock: ఇటీవల మార్కెట్ ఒడిదొడుకులు, అంతర్జాతీయంగా మాంద్యం ప్రభావం వంటి కారణాలతో చాలా స్టాక్స్ మెరుగైన పనితీరును కనబరచటంలో వెనకబడ్డాయి. అయితే మల్టీబ్యాగర్ స్టాక్స్ మాత్రం తమ దూకుడును కొనసాగిస్తున్నాయి. లక్షలు పెట్టిన ఇన్వెస్టర్లను కోటీశ్వరులుగా మార్చేస్తున్నాయి.

కంపెనీ వివరాలు..

కంపెనీ వివరాలు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది రెన్యూవబుల్ వ్యాపారంలో ఉన్న బోరోసిల్ కంపెనీ గురించే. ఈ స్టాక్ పనితీరు గురించి ఒక్కమాటలో చెప్పుకోవాలంటే తనను నమ్మి పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల తలరాతను పూర్తిగా మార్చేసింది. వారిని కోటీశ్వరులను చేసింది. 2003లో కేవలం 11 పైసలుగా ఉన్న ఈ కంపెనీ స్టాక్ 400000% కంటే ఎక్కువ రాబడిని అందించింది.

లక్షను రూ.43 కోట్లుగా మార్చి..

లక్షను రూ.43 కోట్లుగా మార్చి..

మల్టీబ్యాగర్ స్టాక్ ధర షేర్లు మార్చి 5, 2003న BSEలో 11 పైసల వద్ద ఉంది. అయితే నేడు మార్కెట్లో స్టాక్ ధర రూ.481.90 వద్ద ట్రేడవుతోంది. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఆ సమయంలో కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి దానిని కొనసాగించినట్లయితే ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం దాని విలువ రూ.43.8 కోట్లకు చేరుకుని ఉండేది. పైగా కంపెనీ ఆగస్టు 2018లో 3:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను కూడా అందించింది.

పదేళ్ల కాలంలో..

పదేళ్ల కాలంలో..

గడచిన 10 ఏళ్ల రాబడులను గమనిస్తే.. స్టాక్ ఏకంగా 5000% కంటే ఎక్కువ రాబడిని అందించింది. మార్చి 1, 2013లో స్టాక్ ధర బీఎస్ఈలో రూ.9 వద్ద ఉంది. అప్పట్లో ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఇప్పటి వరకు కొనసాగించినట్లయితే దాని విలువ దాదాపు రూ.53 లక్షలకు చేరుకుని ఉండేది. అలాగే ఎవరైనా ఇన్వెస్టర్ కనీసం మూడేళ్ల కిందట స్టాక్ ధర రూ.35.10 వద్ద ఉన్నప్పుడు మే 29,2020లో పెట్టుబడి పెట్టిన వారు తక్కువ కాలంలో 1265% రాబడిని పొందేవారు.

English summary

Penny Stock: మ్యాజిక్ చేసిన 11 పైసల స్టాక్.. లక్షను రూ.43 కోట్లుగా మార్చేసింది.. | Borosil Renewables penny stock turned 1 lakh investment into 43 crores

Borosil Renewables penny stock turned 1 lakh investment inti 43 crores
Story first published: Friday, February 17, 2023, 12:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X