Multibagger Stock: కొంత విరామం తర్వాత మార్కెట్లో మళ్లీ మల్టీబ్యాగర్ స్టాక్స్ తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాయి. మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నప్పటికీ కొన్ని షేర్లు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందిస్తూ తమ సత్తా చూపుతున్నాయి. కాసుల వర్షం కురిపిస్తూ పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది సోలార్ గ్లాస్ మేకింగ్ కంపెనీ బోరోసిల్ రెన్యూవబుల్స్ లిమిటెడ్ షేర్ల గురించే. ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. గడచిన మూడేళ్ల కాలంలో ఏకంగా 1100 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఈ క్రమంలో మూడేళ్ల కిందట రూ.37గా ఉన్న షేర్ ధర ఈరోజు రూ.518.75గా ఉంది. మూడేళ్లలో బోరోసిల్ స్టాక్ రూ.లక్ష పెట్టుబడిని నేడు రూ.13 లక్షలకు మించి రాబడిని అందించింది.

మిక్ క్యాప్ విభాగంలోని బోరోసిల్ స్టాక్ ఏప్రిల్ 17, 2020న BSEలో రూ.37.55 వద్ద ట్రేడవుతోంది. ఈ క్రమంలో స్టాక్ ఏప్రిల్ 25, 2022న 52 వారాల గరిష్ఠ స్థాయి అయిన రూ.833ని తాకింది. మార్చి 28, 2023న స్టాక్ 52 వారాల కనిష్ఠ స్థాయి అయిన రూ.380.05ను తాకింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.6.77 వేల కోట్లుగా ఉంది. ఈ రోజు మార్కెట్లో స్టాక్ ధర 1.72 శాతం క్షీణించింది.
కంపెనీలో ప్రమోటర్ల వాటాను గమనిస్తే.. మార్చి 2023తో ముగిసిన త్రైమాసికం నాటికి 12 మంది ప్రమోటర్లకు సంస్థలో 61.62 శాతం వాటాలు ఉన్నాయి. ఇదే క్రమంలో 2.68 లక్షల పబ్లిక్ వాటాదారులు 38.38 శాతం అంటే ఐదు కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. వీరిలో 2.62 లక్షల మంది పబ్లిక్ షేర్‌హోల్డర్లు 3.33 కోట్ల షేర్లు లేదా 25.55 శాతం, రూ.2 లక్షల వరకు మూలధనాన్ని కలిగి ఉన్నారు. మార్చి 2023తో ముగిసే త్రైమాసికానికి, 0.87 శాతం వాటా కలిగిన ఇద్దరు వాటాదారులు మాత్రమే రూ.2 లక్షల కంటే ఎక్కువ మూలధనాన్ని కలిగి ఉన్నారు.
గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో బోరోసిల్ రెన్యూవబుల్స్ నికర లాభం రూ.22.47 కోట్లకు చేరుకుంది. బోరోసిల్ రెన్యూవబుల్స్ ఫోటోవోల్టాయిక్ (PV) ప్యానెల్‌లు, ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లు, గ్రీన్‌హౌస్ ఉపయోగం కోసం నమూనా గాజు, తక్కువ ఇనుప సోలార్ గ్లాస్ తయారు చేస్తుంది. కంపెనీ సోలార్ గ్లాసెస్ విభిన్న ఉత్పత్తుల శ్రేణిని కలిగి ఉంది. ప్రస్తుతం కంపెనీ తన ఉత్పత్తులను 50 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications