భారతదేశంలో రైలు ప్రయాణం అనేది కోట్లాది ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారింది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా లక్షలాది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ ప్రయాణంలో చాలామంది గుర్తించని ఒక ముఖ్యమైన అంశం ఉంది. అది లగేజీ (సామాను) బరువు పరిమితి. చాలామంది తమకు కావలసినంత సామాను తీసుకెళ్లవచ్చని అనుకుంటారు. కానీ, భారత రైల్వే దీనికి స్పష్టమైన నియమాలు విధించింది. ఈ నియమాలను పాటించకపోతే మీరు జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు.
మీరు రైల్వేలో రెండవ తరగతి (Second Class) టికెట్ బుక్ చేసుకుని ప్రయాణిస్తున్నట్లయితే.. మీ లగేజీ బరువు 35 కిలోల కంటే ఎక్కువ కాకూడదు. అంటే మీరు 35 కిలోల వరకు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా తీసుకెళ్లవచ్చు.కానీ, మీరు తీసుకెళ్తున్న లగేజీ 35 కిలోల కంటే ఎక్కువగా.. 70 కిలోల వరకు ఉంటే, అప్పుడు మీరు అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీని రైల్వే స్టేషన్‌లోని లగేజీ బుకింగ్ కౌంటర్ వద్ద ముందుగానే చెల్లించాలి.

మీ లగేజీ బరువు 70 కిలోల కంటే ఎక్కువైతే, మీరు దానిని మీతోపాటు తీసుకెళ్లకూడదు. అప్పుడు రైల్వే రిజర్వ్ లగేజీ వ్యాన్ (Luggage Van) ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఈ వ్యాన్‌లో లగేజీని విడిగా బుక్ చేసుకోవాలి. ఇలా చేయకపోతే TTE లగేజీని తనిఖీ చేసినప్పుడు జరిమానా విధించవచ్చు. సాధారణంగా రైల్వేలో ప్రయాణికుల లగేజీ బరువును ఎవరూ తూకం వేయరు. కానీ కొన్నిసార్లు TTEకి మీ లగేజీ ఎక్కువగా కనిపిస్తే లేదా అనుమానం వస్తే, ఆయన లగేజీని తనిఖీ చేయవచ్చు.మీ లగేజీ బరువు పరిమితిని మించితే, మీరు తగినంత ఫైన్ (జరిమానా) చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు..లగేజీ 35 కిలోల కంటే 10 కిలోలు ఎక్కువగా ఉంటే, ఒక చిన్న అదనపు ఛార్జీ చెల్లించవలసి ఉంటుంది. నీ లగేజీ 45 కిలోల కంటే ఎక్కువగా ఉంటే, జరిమానా మొత్తం లగేజీ ఛార్జీకి 6 రెట్లు వరకూ ఉండవచ్చు. అంటే మీరు లగేజీ బుకింగ్ కోసం రూ.100 చెల్లించాల్సిన స్థితిలో ఉన్నా, దాన్ని బుక్ చేయకపోతే, పట్టుబడితే, రూ.600 వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు.
రైల్వేలు ప్రతి బోగీలో ప్రయాణికుల భద్రతను, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ లగేజీ పరిమితిని నిర్ణయించాయి. చాలా సామాను తీసుకెళ్లడం వల్ల ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుంది. సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతాయి.
ప్రయాణానికి ముందు జాగ్రత్తలు
రైలు ఎక్కే ముందు మీ బ్యాగ్‌ల బరువును ఒకసారి తూకం వేయండి.
లగేజీ ఎక్కువగా ఉంటే ముందుగానే లగేజీ బుక్ చేసుకోండి.
ప్రయాణ సమయంలో రైల్వే టికెట్‌తో పాటు లగేజీ రసీదును కూడా తీసుకెళ్లండి.
అనుమానం ఉన్నప్పుడు రైల్వే సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకోండి.
మీరు చేసే చిన్న తప్పిదం వల్ల పెద్ద ఇబ్బంది ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి రైలు ప్రయాణానికి బయలుదేరే ముందు లగేజీ బరువును ఖచ్చితంగా తనిఖీ చేయండి. రైల్వే నియమాలను పాటించడం ద్వారా మీరు జరిమానా తప్పించుకోవడమే కాకుండా, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications