Bondada Engineering Stock: స్టాక్ మార్కెట్ల పనితీరుతో సంబంధం లేకుండా కొన్ని కంపెనీల షేర్లు మాత్రం రోజూ అప్పర్ సర్క్యూట్లో కొనసాగుతూ తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. ఈ క్రమంలో మనం మాట్లాడుకుంటున్న షేర్ మాత్రం వరుసగా 8 రోజుల నుంచి అప్పర్ సర్క్యూట్ తాకుతోంది.
ఇప్పుడు మనం బొండాడ ఇంజనీరింగ్ కంపెనీ షేర్లు ఉత్తమ పనితీరు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ కంపెనీ 9 నెలల కిందట దేశీయ స్టాక్ మార్కెట్లోకి తన షేర్లను లిస్టింగ్ చేసింది. ఐపీవో సమయంలో కంపెనీ తన షేర్లను ఒక్కోటి రూ.75 రేటు వద్ద విక్రయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం స్టాక్ గడచిన 8 రోజులుగా మార్కెట్లో అప్పర్ సర్క్యూట్లో కొనసాగుతోంది. దీంతో ఇన్వెస్టర్లలో కోలాహలం కొనసాగుతోంది. నేడు మార్కెట్లు ముగిసే సమయంలో బొండాడ కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.1,642.95 వద్ద ఉన్నాయి.

2023 ఆగస్టు 18న బొండాడ కంపెనీ ఐపీవో మార్కెట్లో తెరవబడి ఆగస్టు 23న ముగిసింది. ఐపీవో సమయంలో కంపెనీ షేరు ధర రూ.75 ఇష్యూ చేయబడినప్పటికీ.. ఆగస్టు 30, 2023న లిస్టింగ్ సమయంలో కంపెనీ షేర్లు రూ.142.50 వద్ద బలమైన లాబడులతో అడుగుపెట్టాయి. ఈ క్రమంలో మెుదటిరోజే ఇన్వెస్టర్లు దాదాపు 100 శాతం వరకు రాబడిని అందుకున్నారు. అయితే కంపెనీ షేర్లలో ర్యాలీ అక్కడితో ఆగిపోలేదు దాదాపు 9 నెలల కాలంలో స్టాక్ ఏకంగా ఇష్యూ ధర కంటే 2090 శాతం ర్యాలీని నమోదు చేసి నేడు మార్కెట్లో రూ.1,642.95 వద్ద ప్రయాణాన్ని ముగించింది.
అలాగే ఆరు నెలల కాలంలో బొండాడ ఇంజనీరింగ్ స్టాక్ తన పెట్టుబడిదారులకు 327 శాతం రాబడిని అందించింది. నవంబర్ 6, 2023న కంపెనీ షేర్లు రూ.384.70 వద్ద ఉన్నప్పటికీ నేడు రూ.1,642.95 స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. గత నెలలో కంపెనీ షేర్లు దాదాపు 72% పెరిగాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్లు రూ.957.15 నుంచి రూ.1642.95కి చేరుకున్నాయి. గత 3 నెలల్లో బొండాడ ఇంజినీరింగ్ షేర్లు 121% రాబడిని అందించింది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన స్టాక్ లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీవోలో 1,20,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టర్లు నేటి మార్కెట్ ధర ప్రకారం వారి పెట్టుబడి విలువ రూ.26.28 లక్షలకు పైగా రాబడిని అందుకునేవారు. అంటే దీర్ఘకాలంలో కంపెనీ షేర్లలో పెట్టుబడులను కొనసాగించిన పెట్టుబడిదారులకు కనకవర్షం కురిపించింది ఈ ఎస్ఎమ్ఈ స్టాక్.


Click it and Unblock the Notifications