Bondada Engineering Stock: గత రెండేళ్లుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం కొనసాగుతోంది. లిస్టింగ్ తర్వాత కూడా కొన్ని తమ ర్యాలీని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మల్టీబ్యాగర్ రాబడులను అందించిన ఐపీవో స్టాక్ గురించే.
బొండాడ ఇంజనీరింగ్ కంపెనీ షేర్లు స్వల్ప కాలంలోనే తమ అద్భుతమైన పనితీరును కనబరిచాయి. ఐపీవోలో పాల్గొన్న ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్లను ఒక్కొక్కటి కేవలం రూ.75కే కేటాయింపులో పొందిన సంగతి తెలిసిందే. అనతికాలంలోనే ఊహించని రాబడులను అందించిన స్టాక్.. శుక్రవారం 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ.1005 రేటుకు చేరుకుంది. దీంతో శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేర్లు సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.

ఐపీవోలో పాల్గొని షేర్లను పొందిన ఇన్వెస్టర్లకు కంపెనీ 6 నెలల కాలంలోనే బంపర్ లాభాలను అందించి ధనవంతులుగా మార్చేసింది. ఈ కాలంలో మెగా ర్యాలీతో ఇన్వెస్టర్లు 1200% కంటే ఎక్కువ బలమైన రాబడిని అందుకున్నారు. ఐపీవో ఆగస్టు 18న రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ప్రారంభమై ఆగస్టు 22న ముగిసింది. రూ.75 రేటుకే ఇష్యూ అయినప్పటికీ స్టాక్ లిస్టింగ్ రోజు ఆగస్టు 30న మార్కెట్లోకి రూ.142.50 రేటు వద్ద జాబితా చేయబడింది. వాస్తవానికి ఈ రేటు కంపెనీ 52 వారాల కనిష్ఠ ధరగా ఉంది. అలాగే జనవరి 1, 2024న రూ.417.10 రేటు వద్ద ఉన్న స్టాక్ ధర ప్రస్తుతం రూ.1000 మార్కును అధిగమించింది.
బొండాడ ఇంజనీరింగ్ ఐపీవో మొత్తం 112.28 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. కంపెనీ IPOలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 100.25 రెట్లు, ఇతరుల కేటగిరీలో 115.46 సార్లు బెట్టింగ్‌లు జరిగాయి. ఈ క్రమంలో లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా కంపెనీ నిర్ణయించటా ఇందుకోసం ఇన్వెస్టర్లు ఏకంగా రూ.1,20,000 పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. కంపెనీలో 86 శాతంగా ఉన్న ప్రమోటర్ల వాటా ఐపీవో తర్వాత 63.33 శాతానికి తగ్గింది.


Click it and Unblock the Notifications