IPO News: ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడని రీతిలో ఐపీవోలు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటికి అదే స్థాయిలో ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ సైతం లభిస్తోంది. ఈ క్రమంలో కొన్ని నెలలు గడవక ముందరే ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి.
అవును మార్కెట్లోకి వచ్చి ఇంకా రెండు నెలల కూడా ఇంకా పూర్తి కాకుండానే బొండాడ ఇంజనీరింగ్ ఐపీవో తన ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చేసింది. ఐపీవో సమయంలో కంపెనీ ఒక్కో షేరును రూ.75 చొప్పున విక్రయించింది. ప్రస్తుతం మార్కెట్లో బొండాడ ఇంజినీరింగ్ షేర్లు రూ.250ను దాటాయి. ఈ క్రమంలో 52 వారాల గరిష్ఠ ధరను గమనిస్తే రూ.268.30గా ఉండగా.. షేర్ల 52 వారాల కనిష్ట స్థాయి రూ.142.50గా ఉంది.

రిటైల్ ఇన్వెస్టర్లు రూ.1.20 లక్షలతో ఒక్క లాట్ షేర్లను కొనుగోలు చేశారు. ఐపీవో లిస్టింగ్ సమయంలో స్టాక్ ధర రూ.142.50 వద్ద అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అక్టోబర్ 17, 2023న స్టాక్ తన జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకింది. కంపెనీ ఐపీవోలో 1 లాట్ అంటే 1600 షేర్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు దానిని కొనసాగించి ఉంటే ప్రస్తుతం దాని విలువ రూ.4.21 లక్షలుగా ఉండేది. అంటే దాదాపు రూ.3 లక్షల లాభం వచ్చి ఉండేది.
ఐపీవో సమయంలో రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి అపురూపమైన స్పందన లభించింది. దీంతో 112 కంటే ఎక్కువ సార్లు ఐపీవో సబ్‌స్క్రయిబ్ చేయబడింది. ఆగస్టు 22తో ముగిసిన ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 100 రెట్ల కంటే ఎక్కువ సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. అలాగే ప్రమోటర్ల వాటాలను పరిశీలిస్తే ఐపీవోకి ముందు కంపెనీలో 86 శాతంగా ఉన్న వారి వాటా ప్రస్తుతం 63.33 శాతానికి పరిమితమైంది. 2012లో ప్రారంభమైన బొండాడ ఇంజనీరింగ్ సంస్థ టెలికాం, సోలార్ ఎనర్జీ రంగాల్లో కంపెనీలకు సేవలు అందించే వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.
More From GoodReturns

పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. Jio IPO రెడీ అవుతోంది.. 250 మిలియన్లకు పైగా షేర్లు మార్కెట్లోకి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications