Bondada Engineering IPO: ప్రస్తుతం గత కొన్ని నెలలుగా పదుల సంఖ్యలో కంపెనీలు తమ ఐపీవోలను మార్కెట్లలో ఫ్లోట్ చేస్తున్నాయి. దీంతో ప్రతిరోజూ ఐపీవోలకు సంబంధించిన వార్తలు మార్కెట్లో సందడి చేస్తూనే ఉన్నాయి.
ఈ క్రమంలో నేడు ఇన్‌ఫ్రా రంగానికి సంబంధించిన కంపెనీ బొండాడ ఇంజనీరింగ్ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఈ కంపెనీ షేర్లు వారంలో మూడవ ట్రేడింగ్ రోజు బుధవారం నాడు 100% ప్రీమియంతో స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయబడ్డాయి. బీఎస్ఈ ఇండెక్స్‌లో లిస్టింగ్ అయిన కొద్ది నిమిషాల్లోనే స్టాక్ 5% ఎగువ సర్క్యూట్‌ను తాకింది. కంపెనీ ఒక్కో షేరును రూ.75కి ఇష్యూ చేయగా.. అవి రూ.149.62కి చేరుకున్నాయి.దీంతో ఇన్వెస్టర్ల సంపద తొలిరోజే రెండింతలైంది.

బొండాడ ఇంజనీరింగ్ SME IPO ఆగస్ట్ 18, 2023న పెట్టుబడిదారుల కోసం తెరవబడి ఆగస్టు 22, 2023న ముగిసింది. కంపెనీ ఒక్కో లాట్ లో 1600 ఈక్విటీ షేర్లను విక్రయించింది. కంపెనీ తన షేర్లకు రూ.75గా ధరను నిర్ణయించింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్టాక్ ధర ఇంట్రాడేలో రూ.149.62 వద్ద కొనసాగుతోంది. అప్పర్ సర్క్యూట్లో స్టాక్ లాక్ కావటంతో మార్కెట్ క్యాప్ రూ.325 కోట్లుగా నిలిచింది.

కంపెనీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌ల కోసం ప్రైమ్ డిజైన్, ఇంజనీరింగ్ అండ్ O&M సేవలను అందిస్తుంది. కంపెనీ గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో 11,600 టెలికాం టవర్లు, స్తంభాల ఏర్పాటుతో 7,700 ఇన్‌స్టాలేషన్‌లను చేసింది. బొండాడ ఇంజినీరింగ్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.10.13 కోట్ల నుంచి 23 ఆర్థిక సంవత్సరంలో రూ.18.25 కోట్ల లాభాన్ని ఆర్జించింది.


Click it and Unblock the Notifications