Johnson & Johnson: జాన్సన్ & జాన్సన్ కంపెనీకి పెద్ద ఊరట లభించింది. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ బేబీ పౌడర్ తయారీ లైసెన్స్ నిలివేస్తూ ఇచ్చిన ఆదేశాలను బొంబాయి హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు "కఠినమైన, అసమంజసమైన & అన్యాయమైనదని" కోర్టు వెల్లడించింది. న్యాయమూర్తులు గౌతమ్ పటేల్, ఎస్‌జీ డిగేలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

లైసెన్సు రద్దు..
2022 సెప్టెంబరు 15న లైసెన్సును రద్దు చేస్తూ.. బేబీ పౌడర్ తయారీతో పాటు విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశాలను సవాలు చేస్తూ కంపెనీ కోర్టును ఆశ్రయించింది. కాస్మెటిక్ ఉత్పత్తులకు నాణ్యత, భద్రతా ప్రమాణాలను కొనసాగించడం చాలా ముఖ్యమైనదని బెంచ్ పేర్కొంది. పౌడర్ తయారీలో స్వల్ప వ్యత్యాసం ఉన్నప్పుడు మెుత్తం తయారీ ప్రక్రియను మూసివేయటం సహేతుకం కాదని కోర్టు వ్యాఖ్యానించింది.

కోర్టు ఉత్తర్వులు..
ఈ తీర్పును వెలువరించే సమయంలో వ్యాఖ్యానిస్తూ.. ఒక చీమను చంపటానికి సుత్తిని ఉపయోగించకూడదని అంది. ఇది మాకు విపరీతమైన విధానంగా కనిపిస్తోందని కోర్టు చెప్పింది. స్టేట్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏ ఇతర ఉత్పత్తి కోసం అటువంటి కఠినమైన విధానాన్ని అవలంబించిందని చూపించడానికి ఏమీ లేదని ఈ సందర్భంగా ప్రశ్నించింది.

ప్రభుత్వ ఉత్తర్వులు..
ప్రభుత్వ ఉత్తర్వులను కొనసాగించలేమని పేర్కొంటూ.. హైకోర్టు వాటిని రద్దు చేసింది. కంపెనీ తన బేబీ పౌడర్ ఉత్పత్తులను తయారీ పంపిణీ చేయడానికి, విక్రయించడానికి కోర్టు అనుమతించింది. దీనికి ముందు FDA ములుద్, ముంబై, పూణే, నాసిక్ నుంచి కంపెనీ ఉత్పత్తుల నమూనాలను సేకరించి నాణ్యతను పరిశీలించింది. అయితే ఈ పరీక్షల్లో పౌడర్ నాణ్యతా ప్రమాణాలకు లోబడి లేదని వెల్లడైంది.


Click it and Unblock the Notifications