Bombay Dyeing: నుస్లీ వాడియా నేతృత్వంలోని టెక్స్‌టైల్స్ సంస్థ బాంబే డైయింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ రోజు కంపెనీ స్టాక్ 16 శాతం మేర పెరగటంతో 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.
అసలు షేర్లలో భారీ ర్యాలీకి కారణం పరిశీలిస్తే.. కంపెనీకి ముంబైలోని వర్లీలో ఉన్న 22 ఎకరాల భూమిని విక్రయిస్తున్నట్లు తెలియటమే. జపాన్ కు చెందిన సుమిటోమో రియాల్టీ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీకి చెందిన గోయిసు రియల్టీకి దీని విక్రయం జరుగుతోంది. అయితే 22 ఎకరాల భూమిని రూ.5,200 కోట్ల భారీ మెుత్తానికి విక్రయించాలని నిర్ణయించటంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇది అతిపెద్ద భూముల విక్రయ ఒప్పందంగా రికార్డులను సృష్టించింది. ఇప్పటికే ఈ విక్రయానికి సంబంధించి కంపెనీ బోర్డు తమ అనుమతిని ఇవ్వగా ఇన్వెస్టర్ల ఆమోదంతో ముందుకు సాగాలని కంపెనీ నిర్ణయించింది. అయితే ఈ డీల్ మెుత్తం రెండు దశల్లో జరగనుంది. ఈ వార్తలతో కంపెనీ షేర్లు ఒక్కసారిగా మార్కెట్లో ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. 11.38 గంటల సమయంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.161.80 వద్ద కొనసాగుతోంది.
బాంబే డైయింగ్ ఫేజ్-I కోసం గోయిసు రియల్టీ నుంచి రూ.4,675 కోట్లను అందుకోనుంది. ఆ తర్వాత మిగిలిన మెుత్తాన్ని ఒప్పంద షరతులను అమలు చేసి పూర్తి చేసిన తర్వాత రెండవ ఫేజ్ కింద రూ.525 కోట్లను పొందుతుంది. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం.. మొదటి దశకు సంబంధించిన ఒప్పందం సెప్టెంబర్ 30 నాటికి సంతకం చేసే అవకాశం ఉంది. అలాగే ఫేజ్ II కోసం ఒప్పందం వచ్చే ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలోపు జరుగుతుంది.
తాజా లావాదేవీ కారణంగా కంపెనీ రూ.4,300 కోట్లకు మించి పన్నుకు ముందు లాభాన్ని నమోదు చేయెుచ్చని తెలుస్తోంది. కంపెనీ తమకు ఉన్న ల్యాండ్ బ్యాంక్ వినియోగించుకుని రియల్టీ వ్యాపారం ద్వారా కంపెనీ లాభదాయకతను ముందుకు తీసుకెళ్లాలని మార్చి 2022లో బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. భవిష్యత్తు రియల్టీ ప్రాజెక్టుల అవసరాలకు నిధుల సమీకరణలో భాగంగా తాజా 22 ఎకరాల విక్రయం జరుగుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
More From GoodReturns

ప్రాప్షేర్ సెలెస్టియా REIT ఐపీఓ: నేడే చివరి అవకాశం!

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

హైదరాబాద్ నీటి కష్టాలు: ఐటీ కారిడార్లో అద్దెలు ఆకాశానికి!

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్లో పెరిగిన డిమాండ్!

అమరావతి రియల్ ఎస్టేట్: ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయా?

అమరావతి ల్యాండ్ పూలింగ్: నేడే ఆఖరి అవకాశం, రైతుల పరిస్థితి ఏంటి?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..



Click it and Unblock the Notifications