Celebrity Stock: ఆహా.. 8 రెట్లు లాభం.. ఈ కంపెనీలో లక్ష షేర్లు కొన్న బాలీవుడ్ సూపర్ స్టార్..
Ajay Devgan: ప్రస్తుత కాలంలో ఆదాయాలు పెరగిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక మంది తమ డబ్బును మరింతగా రెట్టింపు చేసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది స్టాక్ మార్కెట్లను ఆశ్రయిస్తున్నారు.
గతంలో ఇన్వెస్టర్లు ప్రముఖ పెట్టుబడిదారులను స్టాక్ మార్కెట్లో ఫాలో అయ్యేవారు. అయితే ఇప్పుడు తమకు ఇష్టమైన నటులను సైతం పెట్టుబడుల విషయంలో ఫాలో అయిపోతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ స్టాక్ మార్కెట్ భారీ పెట్టుబడి గురించే.'సింగమ్' స్మాల్‌క్యాప్ స్టాక్ పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్‌లో లక్ష షేర్లను కొనుగోలు చేసింది. గత 6 నెలల్లో కంపెనీ షేర్ ధర పెరిగిన సంగతి తెలిసిందే.

9 మంది ఇన్వెస్టర్లు ప్రిఫరెన్షియల్ షేర్ అలాట్‌మెంట్ ద్వారా రూ.24.66 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు పనోరమా స్టూడియోస్ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో తెలిపింది. స్మాల్‌క్యాప్ కంపెనీలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఒక్కో షేరుకు రూ.274 చొప్పున కొనుగోలు చేస్తూ రూ.2.74 కోట్లు పెట్టుబడిగా పెట్టారు.
శనివారం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ ముగింపు నాటికి కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.949 స్థాయిలో ఉంది. కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.970 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.91గా కొనసాగుతోంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,181.20 కోట్లుగా ఉంది.
గడచిన 6 నెలల కాలంలో పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్ షేర్లు స్టాక్ మార్కెట్‌లో అద్భుత వృద్ధిని నమోదు చేశాయి. ఈ కాలంలో కంపెనీ షేర్ల ధర 271 శాతం పెరిగాయి. ఈ లెక్కన ఎవరైనా పెట్టుబడిదారుడు 6 నెలల కిందట కంపెనీ షేర్లను కొనుగోలు చేసి ఇప్పటి వరకు హోల్డ్ చేసినట్లయితే వారి సంపద రెండింతలకు పైగా పెరిగి ఉండేది. ఇదే క్రమంలో ఏడాది కిందట మల్టీబ్యాగర్ షేర్లలో పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా 861 శాతం రాబడిని అందుకున్నారు. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ ఏడాది కిందట కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టినట్లయితే దాని విలువ ప్రస్తుతం రూ.8.60 లక్షలు దాటి ఉండేది.


Click it and Unblock the Notifications