బంగారం ధర ప్రస్తుతం ఎ రేంజ్లో ఉందొ ఇప్పుడు లగ్జరీ ఇంటి విలువ కూడా అదే రేంజ్లో పలుకుతుంది. అయితే లగ్జరీ ఇళ్లకు ఉన్న డిమాండ్ గతం నుండే పెరుగుతు వస్తుంది. కానీ ఈ రోజుల్లో వీటి ధరలు కోట్లల్లో వినిపిస్తుంది. సొంత ఇల్లు అనేది ఎవరికైనా ఒ కల. కానీ ఆ ఇంటిని కలల ఇల్లుల మార్చుకోవాలని కొందరు అనుకుంటారు. ఈ తరుణంలోనే బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఇల్లు మన్నత్‌ను పునరుద్ధరించబోతున్నారు. ఇందుకు అతను ఈ సమయంలో కుటుంబంతో కలిసి ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలోని రెండు లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్లలో ఉంటున్నారు.

మన్నత్ కు కొత్త లుక్ ఇచ్చే ప్లాన్ గత ఏడాది నవంబర్ లో వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం గౌరీ ఖాన్ మహారాష్ట్ర తీరప్రాంత మండల నిర్వహణ అథారిటీ నుండి అనుమతి కోరింది. మన్నత్‌లో మరో రెండు అంతస్తులు కొత్తగా నిర్మించనున్నారు. దీనివల్ల బంగ్లా వైశాల్యం 616.02 చదరపు మీటర్లు పెరుగుతుంది. ఈ పునరుద్ధరణకు దాదాపు రూ.25 కోట్లు ఖర్చవుతుందట. 2001లో షారుఖ్ మన్నత్‌ను రూ.13.01 కోట్లకు కొనుగోలు చేశాడు. కానీ నేడు దాని విలువ దాదాపు రూ.200 కోట్లు పైమాటే.
పూజా కాసా భవనం ఎవరిది: షారుఖ్ ఖాన్ ఇంకా అతని కుటుంబం పాలి హిల్‌లోని పూజా కాసా భవనంలో ఉంటున్నారు. ఈ ప్రాంతం సిని తారలు, పెద్ద వ్యాపారవేత్తలకు చాల ఇష్టమైన నగరం. పూజా కాసా భవనం భగ్నాని ఫ్యామిలీకి చెందినది. వీరిలో చిత్రనిర్మాత వాషు భగ్నాని, హీరో జాకీ భగ్నాని ఇంకా నిర్మాత దీప్శిఖా దేశ్‌ముఖ్ ఉన్నారు.
అద్దెకు ఉన్న డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌లు అంతస్తులలో విస్తరించి ఉన్నాయి. ఒక సెట్ మొదటి, రెండవ అంతస్తులలో ఉంది. రెండవ సెట్ ఏడవ ఇంకా ఎనిమిదవ అంతస్తులలో ఉంది. ఈ రెండు అపార్ట్‌మెంట్‌లు కలిపి దాదాపు 10,500 చదరపు అడుగులు. అయితే షారుఖ్ ఉంటున్న 27,000 చదరపు అడుగుల మన్నత్ బంగ్లా కంటే చాలా చిన్నది.
నెలకు అద్దె ఎంత: ఈ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్ ఒప్పందం 36 నెలలు. అంటే రెంట్ ఏప్రిల్ 1 నుండి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 14న రిజిస్టర్ చేసుకున్నారు. దీనికోసం రూ.2.22 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. NDTV, పింక్‌విల్లా అండ్ ఇతర నివేదికల ప్రకారం, మూడు సంవత్సరాల అద్దె రూ. 8.7 కోట్లు. అంటే ప్రతినెల అద్దె రూ. 24.15 లక్షలు అవుతుంది. ఇది కాకుండా రెండు డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌లకు సెక్యూరిటీ డిపాజిట్ దాదాపు రూ.68.97 లక్షలు.
రేనోవేషన్ సమయంలో షారుఖ్, గౌరీ ఖాన్ ఇంకా అతని ముగ్గురు పిల్లలు ఆర్యన్, సుహానా ఇంకా అబ్రామ్ అలాగే సిబ్బంది కూడా పూజా కాసా భవనంలోనే ఉంటారు. ఈ ఇంటి రేనోవేషన్ అనేది చాలా పెద్ద పని. ఈ కారణంగానే షారుఖ్ ఖాన్ ఇంకా అతని కుటుంబం కొంతకాలం వేరే ఇంట్లో ఉండాలనుకున్నారు.


Click it and Unblock the Notifications