బాలీవుడ్‌లో 'స్టార్స్ వార్' మొదలైంది. అందేంటి? హీరోలైనా, హీరోయిన్లు అయినా.. ఈ పోటీ ఎప్పుడూ ఉండేదే కదా.. అంటారా? అబ్బే మేం చెప్పేది ఆ పోటీ గురించి కాదండీ. వ్యాపార రంగంలో పోటీ గురించి. అదీ ఇద్దరు హీరోయిన్ల నడుమ.
అవును, వారెవరో కాదు. తన అంగాంగ ప్రదర్శనతో దేశంలోని కుర్రకారుకు కిర్రెక్కించిన శృంగార తార.. సన్నీ లియోన్ ఒకరు కాగా, మరొకరు నటనలోనే కాక తనదైన శైలిలో డాన్స్‌తో ఊర్రూతలూగిస్తూ బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోన్న కత్రినా కైఫ్.

‘కే బ్యూటీ' పేరుతో...
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌కి ఫ్యాన్స్‌లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సినిమాల్లో ఆమె డాన్స్‌కు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.హీరోయిన్‌గా నటించడమేకాదు, కత్రినా సొంతంగా సినిమాలు కూడా తీస్తోంది. ఇప్పుడు వ్యాపార రంగంలోకి కూడా ప్రవేశించింది. తాజాగా ‘కే బ్యూటీ' పేరుతో సరికొత్త బ్యూటీ బ్రాండ్ ఆవిష్కరించింది.

‘నైకా'తో భాగస్వామ్యం...
‘కే బ్యూటీ' బ్రాండ్ ప్రస్తుతం 48 రకాల ఉత్పత్తులతో కూడిన బ్యూటీ కలెక్షన్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. వీటిలో లిప్, కాజల్, ఐ, బ్రౌ సంబంధిత ఉత్పత్తులు ఉన్నాయి. దీనికోసం దేశంలోని మరో బ్యూటీ రిటైలర్ అయిన ‘నైకా'తో భాగస్వామ్యం కుదర్చుకుంది కత్రినా కైఫ్. దీంతో కే బ్యూటీ ఉత్పత్తులన్నీ ఇప్పుడు నైకా స్టోర్లలో, నైకా వెబ్ సైట్, నైకా యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి.

‘‘అనుభవంతోనే వ్యాపారంలోకి...''
ఇటీవల తన ‘కే బ్యూటీ' బ్రాండ్ ఉత్పత్తులు లాంచ్ చేసిన కత్రినా కైఫ్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్‌లోని అనుభవంతోనే తాను ఈ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు చెప్పింది. బ్యూటీ, స్కిన్ అనేవి మహిళలకు ఎంతో ముఖ్యమని, తమ ‘కే బ్యూటీ' బ్రాండ్ వెనుక పెద్ద టీమ్ ఉందని, తమ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా మహిళలను ఆకర్షిస్తాయని భావిస్తున్నానని పేర్కొంది.

అందరికీ అనువైన ఉత్పత్తులతో...
‘కే బ్యూటీ' ఉత్పత్తులు మహిళలందరికీ అనువుగా ఉంటాయని కత్రినా కైఫ్ తెలిపింది. వివిధ రకాల స్కిన్ టోన్స్, వయసు, ఎమోషన్స్ కలిగిన వారి కోసం తాము ఈ ఉత్పత్తులు ఆవిష్కరించామని పేర్కొంది. గత రెండేళ్ల నుంచి దీనిపై కసరత్తు జరిగిందని, మార్కెట్‌లో ఎక్కువ కాలం నిలిచే బ్రాండ్‌ను తీసుకురావాలని తాను భావించానని, ‘కే బ్యూటీ'తో అది సాధ్యమైందని వ్యాఖ్యానించింది.

ఇప్పటికే ఈ వ్యాపారంలో సన్నీలియన్...
బాలీవుడ్ శృంగార తార సన్నీలియన్ ఇప్పటికే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్‌లో ఉంది. ఆమె చాలా కాలం క్రితమే ‘సన్ సిటీ స్టోర్స్' పేరుతో ఈ వ్యాపారంలోకి ప్రవేశించింది. మరి ఈ రంగంలో తాజాగా కత్రినా కైఫ్ కూడా దిగడంతో ఒకరకంగా ఇది సన్నీలియోన్‌కి పోటీ లాంటిదే. మరి నటనలో, సినిమాల్లో పోటీ పడే ఈ సుందరీమణులు బిజినెస్‌లో ఎలా పోటీ పడతారో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications