Startup News: ఒకప్పుడు నటులు కేవలం తమ రంగానికి మాత్రమే పరిమితమయ్యేవారు. అయితే మారుతున్న ట్రెండ్ ప్రకారం వారు కూడా అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.
స్టార్టప్ కంపెనీల పట్ల బాలీవుడ్ నటులకు ఉంటే ఆసక్తి పైకి పెద్దగా కనిపించనప్పటికీ వాస్తవానికి ఎక్కువే. సునీల్ శెట్టి, రణవీర్ సింగ్, అలియా భట్ తర్వాత .. తాజాగా సంజయ్ దత్ పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. అవును ఆయన ముంబైకి చెందిన ఆల్కోబెవ్ అనే మద్యం వ్యాపారంలో ఉన్న స్టార్టప్ కంపెనీలో డబ్బు ఇన్వెస్ట్ చేశారు.

ఈ లిక్కర్ స్టార్టప్ దేశంలోకి వివిధ లిక్కర్ బ్రాండ్‌ల పోర్ట్‌ఫోలియోను దిగుమతి చేసి విక్రయించే వ్యాపారాన్ని నిర్వహించనుంది. కంపెనీ ప్రారంభ ఉత్పత్తుల్లో ఒకటి స్కాచ్ విస్కీ బ్రాండ్ గ్లెన్‌వాక్. దీనిని కంపెనీ నేరుగా స్కాట్లాండ్ నుంచి దిగుమతి చేస్తోంది. దీనికి తోడు వోడ్కా, టేకిలా, సింగిల్ మాల్ట్ బ్రాండ్‌లను కూడా కంపెనీ భారత్‌కు తీసుకువస్తుందని లివింగ్ లిక్విడ్స్ ప్రమోటర్ మోక్ష్ సోనీ తెలిపారు.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆల్కోవెబ్ స్టార్టప్ తో పాటు మరో కంపెనీలో కూడా డబ్బు పెట్టుబడిగా పెట్టారు. సైబర్ మీడియా (ఇండియా) లిమిటెడ్‌లో సంజయ్ దత్ 1% కంటే తక్కువ వాటాను కలిగి ఉన్నారు. సైబర్ మీడియా ఒక ప్రత్యేక మీడియా హౌస్. ఇది దాదాపు 12 మీడియా ప్రాపర్టీలను నడుపుతోంది. వీటిలో డేటాక్వెస్ట్, PCQuest, వాయిస్&డేటా, గ్లోబల్ సర్వీసెస్, DQ ఛానెల్స్, DQ వీక్ (ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కతా) ఉన్నాయి.


Click it and Unblock the Notifications