Ranveer Singh: కొత్త బిజినెస్‌లోకి బాలీవుడ్ హీరో.. ఆ కంపెనీలో రణ్‌వీర్ భారీగా పెట్టుబడులు
Boat: కేవలం నటనలోనే కాకుండా వివిధ వ్యాపారాల్లో రాణిస్తున్న సినీతారలు ఎంతో మంది ఉన్నారు. బాలీవుడ్‌కు చెందిన రణ్ వీర్ సింగ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ప్రముఖ దేశీయ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌లో ఆయన పెట్టుబుడులు పెట్టినట్లు ఆ కంపెనీ ప్రకటించింది.
ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థ బోట్(boAt)లో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేసినట్లు దాని యాజమాన్యం వెల్లడించింది. తద్వారా కీలక వాటాదారునిగా మారినట్లు తెలిపింది. ఒప్పందంలో భాగంగా అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం చేసినట్లు పేర్కొంది. దీంతో తమ కొత్త ప్రచార క్యాంపెయిన్ 'లాస్ట్ ఇన్ నిర్వాణ'లో ఆయన భాగమైనట్లు స్పష్టం చేసింది.

'ఆయన పెట్టుబడి సహా వ్యూహాత్మక ప్రమేయం.. దేశవ్యాప్తంగా ఆడియో అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చే మా మిషన్‌కు బూస్ట్ ఇస్తుంది. అందరం కలిసి సరిహద్దులను చెరిపేస్తూ, సౌండ్‌కు కొత్త నిర్వచనం చెబుతాం. అభిరుచి మరియు ఆవిష్కరణలతో కూడిన సమాజాన్ని సృష్టిస్తాం' అని బోట్ సహ వ్యవస్థాపకులు మరియు CMO అమన్ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు.
'బెస్ట్-ఇన్-క్లాస్ సౌండ్ మరియు యూత్ కనెక్ట్ కోసం బోట్ నాతో కలిసి నిబద్ధతతో పనిచేస్తోంది. వారి ప్రయాణంలో పెట్టుబడి పెట్టడం కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు. ఇది ఒక నూతన విప్లవాన్ని సృష్టించడంలో భాగం. ఇండియా సౌండ్ దద్దరిల్లే ఈ ప్రయాణంలో బోట్ కోసం సిద్ధంగా ఉండండి' అని రణ్‌వీర్ పేర్కొన్నారు.
ఆకర్షణీయమైన యాడ్ ఫిల్మ్‌తో 'లాస్ట్ ఇన్ నిర్వాణ' క్యాంపెయిన్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసాధారణమైన ఫీచర్‌లను ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు వీక్షకులను ఆహ్వానిస్తోంది. ఆకట్టుకునే 120 గంటల బ్యాటరీ లైఫ్, బోట్ సిగ్నేచర్ సౌండ్ తో పాటు అత్యాధునిక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ టెక్నాలజీని ఈ సిరీస్‌లో పొందుపరుస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications