రోజూ కోటి రూపాయల ఆదాయం: అక్షయ్ కుమార్..రికార్డ్ కంటిన్యూస్: బాలీవుడ్ నుంచి వన్ అండ్ ఓన్లీ

ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరో అరుదైన ఘనతను అందుకున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాలో టాప్-10లో చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పారితోషికాన్ని అందుకున్న నటుడిగా ఆరోస్థానంలో నిలిచారు. 2019-2020 మధ్యకాలంలో సంవత్సరానికి అక్షయ్ కుమార్ సంపాదన 48.5 మిలియన్ డాలర్లు. దేశీయ కరెన్సీతో పోల్చుకుంటే సుమారు 350 కోట్ల రూపాయల పైమాటే. ఈ లెక్కన చూస్తే.. అక్షయ్ కుమార్ ఆదాయం రోజూ కోటి రూపాయల చొప్పున నమోదైనట్టే. ఫోర్బ్స్ జాబితాలో చోటు లభించిన ఏకైక బాలీవుడ్ నటుడు ఆయనే.

ఫోర్బ్స్ మేగజైన్ ఈ మేరకు మంగళవారం దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. హాలీవుడ్, బాలీవుడ్ సహా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నటుల వివరాలను పొందుపరిచింది. రాక్ పేరున్న డ్వేన్ జాన్సన్ టాప్ ప్లేస్‌లో నిలిచారు. వరుసగా రెండవ సంవత్సరం ప్రపంచంలో అత్యధిక పారితోషికాన్ని అందుకున్న మేల్ యాక్టర్ల జాబితాలో డ్వేన్ జాన్సన్ అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఇది రెండోసారి. సినిమాల్లో నటించడం ద్వారా డ్వేన్ జాన్సన్ ఆదాయం 87.5 మిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆయన తరువాత డ్వేన్ జాన్సన్‌తో పాటు ర్యాన్ రేనాల్డ్స్, మార్క్ వాహ్లెబెర్గ్, బెన్ అఫ్లెక్, విన్ డీజిల్ తొలి అయిదు స్థానాల్లో నిలిచారు.

 Bollywood actor Akshay Kumar is the 6th highest paid actor in the world as Forbes list

ఆరో స్థానంలో అక్షయ్ కుమార్ చోటు దక్కించుకున్నారు. మాన్యుయెల్ మిరాండా, విల్ స్మిత్, ఆడం శాండ్లర్, జాకీచాన్ టాప్ టెన్ జాబితాలో ఉన్నారు. అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు వరుస హిట్లను సాధించాయి. మిషన్ మంగళ్, హౌస్‌ఫుల్-4 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ అనే రీమేక్ మూవీలో నటిస్తున్నారు. కన్నడంలో సూపర్‌హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ బెల్ బాటమ్. జయతీర్థ దర్శకత్వాన్ని వహించిన ఈ సినిమాలో రిషబ్ షెట్టి, హీరో హీరోయిన్లుగా నటించారు. ఇదే మూవీని అక్షయ్ కుమార్ రీమేక్ చేస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+