జీవితంలో విజయం సాధించాలంటే పెద్ద పెద్ద డిగ్రీలు ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ, కష్టపడే తత్వం, పట్టుదల ఉంటే చదువుతో సంబంధం లేకుండా ప్రపంచాన్ని జయించవచ్చని నిరూపించారు తెలంగాణకు చెందిన బొల్లపల్లి శ్రీకాంత్. పదో తరగతిలోనే చదువు ఆపేసి, ఒకప్పుడు రోజుకు 18 గంటల పాటు పొలంలో కూలీగా పనిచేసిన ఒక సామాన్య యువకుడు.. నేడు ఏడాదికి రూ. 70 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి ఎలా ఎదిగారో తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

కష్టాల్లో మొదలైన బాల్యం
శ్రీకాంత్ స్వగ్రామం నిజామాబాద్ జిల్లాలోని బోధన్. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆయనకు చిన్నప్పుడే కష్టాలు మొదలయ్యాయి. కుటుంబం అప్పుల్లో ఉండటంతో పదో తరగతి తర్వాత చదువు సాగించలేకపోయారు. కేవలం 16 ఏళ్ల వయసులో ఇంటి బాధ్యతను భుజాన వేసుకుని బెంగళూరుకు పయనమయ్యారు. అక్కడ నెలమంగళలోని పూల తోటల్లో నెలకు కేవలం వెయ్యి రూపాయల జీతానికి కూలీగా చేరారు. రోజుకు 18 గంటల పాటు ఎండనక, వాననక కష్టపడేవారు. ఆ కష్టమే తనకు "స్ట్రీట్ సైడ్ MBA" నేర్పిందని శ్రీకాంత్ గర్వంగా చెబుతుంటారు.
వ్యాపారంలో తొలి అడుగు
కూలీగా పనిచేస్తూనే పూల మార్కెట్ మెళకువలను గమనించిన శ్రీకాంత్.. 1997 లో తన 18వ ఏట వ్యాపారంలోకి అడుగుపెట్టారు. కేవలం రూ. 20,000 పెట్టుబడితో ఒక చిన్న పూల దుకాణాన్ని ప్రారంభించారు. మొదటి ఏడాదిలోనే రూ. 5 లక్షల టర్నోవర్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 25 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆయన వ్యాపారం రూ. 5 కోట్ల మార్కును అందుకుంది.
వెన్సాయ్ ఫ్లోరిటెక్ (Vensai Floritech) ఆవిర్భావం
వ్యాపారిగా ఉన్న శ్రీకాంత్.. 2005 లో సాగుదారుడిగా (Grower) మారాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరు శివార్లలో భూమిని సేకరించి వెన్సాయ్ ఫ్లోరిటెక్ సంస్థను స్థాపించారు. నేడు ఈ సంస్థ సుమారు 70 ఎకరాల్లో అత్యాధునిక టెక్నాలజీతో పూల సాగు చేస్తోంది. గులాబీలు, జెర్బెరా, కార్నేషన్ వంటి సుమారు 20 రకాల పూలను ఇక్కడ పండిస్తున్నారు. అంతేకాదు తన కుమార్తె పేరు మీద 'మోక్ష శ్రీ' అనే సరికొత్త జెర్బెరా రకాన్ని కూడా ఆయన సృష్టించారు.
టెక్నాలజీతో గ్లోబల్ మార్కెట్‌కు..
సాంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా హైటెక్ పద్ధతులను శ్రీకాంత్ అనుసరించారు. ఆటోమేటెడ్ ఇరిగేషన్, క్లైమేట్ కంట్రోల్డ్ పాలీహౌస్ లు, కోల్డ్ స్టోరేజ్ వంటి సౌకర్యాలతో నాణ్యమైన పూలను పండిస్తున్నారు. నేడు ఆయన పండించిన పూలు మన దేశంలోని ప్రధాన నగరాలకే కాకుండా దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి.
ఏది ఏమైనా.. జీరోతో మొదలుపెట్టిన శ్రీకాంత్ గారు కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా, ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఎదగడం నిజంగా స్ఫూర్తి దాయకం. తను వ్యాపారం చేస్తూ.. ఇతర రైతులకు కూడా మార్గనిర్దేశం చేస్తున్నారు. ఏ డిగ్రీ లేకపోయినా కృషితో కోట్లు సంపాదించవచ్చని నిరూపించిన ఈ తెలంగాణ బిడ్డ ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. నిజమైన సక్సెస్ స్టోరీ(Success story) అంటే ఇదే!
More From GoodReturns

Success story: రూ. 600 కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి మళ్ళీ సున్నా నుండి మొదలుపెట్టాడు!

Trending: స్కూల్ మానేస్తే రూ. 2.8 కోట్లు ఇస్తామన్నారు.. కానీ, ఈ 16 ఏళ్ల కుర్రాడు ఏం చేశాడో చూడండి!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications