Boeing: వరుసగా లే ఆఫ్ లు, ఉద్యోగాల కోతలు వినపడుతున్న ప్రస్తుత సమయంలో బోయింగ్ సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. జెట్‌లైనర్ ఉత్పత్తిని పెంచడంతో 2023లో 10 వేల మంది కార్మికులను నియమించుకోవాలని యోచిస్తోంది. విమానయాన రంగంలో పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి వ్యాపార, ఇంజనీరింగ్, తయారీ విభాగాల్లో ఉద్యోగులను తీసుకోనున్నట్లు పేర్కొంది.

తీసుకుంటూనే..తొలగింపులు
కొవిడ్ సంక్షోభం నుంచి కోలుకున్న అనంతరం ఉత్పత్తిని పెంచుతున్నందున పెద్ద ఎత్తున కొలువులు సృష్టిస్తూనే.. కొన్ని సహాయక ఉద్యోగాలను తగ్గిస్తున్నట్లు బోయింగ్ తెలిపింది. ఎంత మందిని తొలగిస్తుందో మాత్రం చెప్పలేదు. సాంకేతిక అభివృద్ధికి తోడ్పాటు కోసం ఈ తరహా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. కానీ ఈ ఏడాది అమెరికాలో కొత్తగా సృష్టించనున్న ఉద్యోగాల సంఖ్యపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

వేలాది ఉద్యోగాలు..
2022 చివరి నాటికి వర్జీనియాకు చెందిన Arlington, లక్షా 42 వేల మందిని రిక్రూట్ చేసుకుంది. అదే సమయంలో అమెరికాలో బోయింగ్ కొత్తగా లక్షా 36 వేల కొలువులు సృష్టించింది. ఈ వారం 13 వేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి యూరప్ కు చెందిన ప్రత్యర్థి కంపెనీ ఎయిర్ బస్ యోచిస్తోంది. వాటిలో 9 వేల మందిని కేవలం ఐరోపాలోనే తీసుకోనుంది. మొత్తం కొత్త ఉద్యోగాల్లో 7 వేలు కొత్తగా సృష్టించిన స్థానాలు కావడం విశేషం.

పరిమితులు లేవు
దాదాపు కొవిడ్ ముందు పరిస్థితుల్లోకి బోయింగ్ చేరుకుంది. 2019 చివరి నాటికి లక్షా 61 వేల మంది ఉండగా.. 2022లో తన ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 20 వేల మందిని తొలగించి లక్షా 41 వేలకు కుదించింది. నియామకాలపై పరిమితి పెట్టుకోలేదని ఎయిర్ లైనర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవా కాల్హౌన్ తెలిపారు. అవసరమైన అభ్యర్థులను నియమించుకుని డిమాండ్ కు తగిన విధంగా వారికి శిక్షణ ఇచ్చి సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications