బోయింగ్ సీఈవో డేవ్ కాల్‌హౌన్ 2020 సంవత్సరానికి గాను వేతనం, బోనస్‌ను వదులుకున్నారు. గత ఏడాది కరోనా కారణంగా విమాన సేవలు చాలాకాలం పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా విమానయానరంగం చాలా దెబ్బతిన్నది. బోయింగ్ సంస్థకు గత ఏడాది ఏకంగా 12 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈవో గత ఏడాదికి గాను పనితీరు ఆధారంగా ఇచ్చే బోనస్‌ను, వేతనాన్ని వదులుకున్నారు. అయితే షేర్ల ప్రయోజనాల (స్టాక్ ఆప్షన్) రూపంలో వచ్చే 21 మిలియన్ డాలర్లను మాత్రం అందుకున్నారు.
రెండు 737మ్యాక్స్ ప్లేన్స్ ప్రమాదానికి కారణం కావడంతో ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ విమానాలు నిలిచిపోయాయి. దీనికి తోడు కరోనా వల్ల విమానాలకు డిమాండ్ తగ్గింది. దీంతో బోయింగ్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2020లో 12 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది. డేవ్ కాల్‌హౌన్ 2020 జనవరిలో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. మార్చిలో వేతన నిరాకరణ నిర్ణయానికి ముందు సమయంలో 2,69,231 డాలర్ల వేతనం వచ్చింది.ఇప్పుడు ఆయన 3.6 మిలియన్ డాలర్ల సాలరీని, ప్రోత్సాహాన్ని వదులుకున్నారు.

అయతే మ్యాక్స్ విమానాల సర్వీసులను పునఃప్రారంభమయ్యేలా చేసినందుకు 7 మిలియన్ డాలర్లు, బ్లాక్ స్టోన్స్‌లో తన ఉద్యోగాన్ని వదిలిపెట్టిందుకు 10 మిలియన్ డాలర్లు, దీర్ఘకాలిక ప్రోత్సాహకాల కింద 3.5 మిలియన్ డాలర్ల మేర షేర్ల ప్రయోజనాలు లభించాయి. వచ్చే మూడేళ్ల కాలంలో ఈ షేర్ల ప్రయోజనాలు ఆయనకు అందుతాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications