Boeing CEO: బోయింగ్ CEO కీలక నిర్ణయం.. బోనస్ తీసుకునేందుకు నిరకారణ.. ఎంతైనా గ్రేట్
Alaska Airlines: CEO స్థాయిలోని వ్యక్తికి బోనస్ ఏ రేంజ్‌లో వస్తుందో ఊహించవచ్చు. జీతంతో పాటు అదనంగా బోనస్ పొందాలని చాలా మంది కూడా కష్టపడి పనిచేస్తారు. అయితే కొందరు మహనీయులు మాత్రం మాత్రం అది తీసుకోవడానికి తాను తగిన వాడినా, కాదా అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. తనవల్ల జరిగే పొరపాట్లకు బాధ్యత వహిస్తుంటారు.
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ CEO డేవిడ్ కాల్హౌన్ కూడా ఈ కోవకు చెందిన వ్యక్తే. ఈ ఏడాది కంపెనీని వీడనున్న డేవిడ్.. 2023తిదాను 32.8 మిలియన్ డాలర్ల జీతం అందుకున్నారు. దీనికి తోడు 2.8 మిలియన్ డాలర్ల బోనస్ లభించే అవకాశం ఉంది. అయితే ఈ వార్షిక బోనస్‌ను తీసుకోవడానికి ఆయన నిరాకరించినట్లు బోయింగ్ తన సెక్యూరిటీ ఫైలింగ్‌లో తెలిపింది.

జనవరిలో జరిగిన అలాస్కా ఎయిర్‌లైన్స్ కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమాన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని డేవిడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఆయన అభ్యర్థనను బోర్డు సైతం గౌరవించినట్లు పేర్కొంది. తన పదవీకాలం మొత్తంలో కస్టమర్లు, రెగ్యులేటర్లు, ఫ్లయింగ్ పబ్లిక్ పట్ల పారదర్శకతకు పెద్దపీట వేశారని వివరించింది.
అలస్కా ఎయిర్‌లైన్స్ ఘటనలో 16 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న MAX 9 జెట్ డోర్ ప్లగ్ ప్యానెల్ చిరిగిపోయింది. జనవరి 5న ఏర్పడిన ఈ మిడ్-ఎయిర్ ఎమర్జెన్సీ బోయింగ్ లోటుపాట్లను ఎత్తిచూపింది. దీన్ని విమాన తయారీదారు కూడా అంగీకరించారు. 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో పోర్ట్‌ల్యాండ్ నుంచి అంటారియోకు ఈ విమానం వెళుతోంది. చివరికి సమస్య తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications