ప్రభుత్వరంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా(BoB) బుధవారం డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ BoB worldను ప్రారంభించింది. అన్ని బ్యాంకింగ్ సేవలను కూడా ఒకే గొడుగు కిందకు తీసుకు వస్తూ దీనిని ప్రారంభించింది. ఖాతాదారుల సౌకర్యార్ధం అన్ని డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఒకేచోటుకు తీసుకువచ్చేందుకు బీఓబీ వరల్డ్ పేరుతో డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై సేవింగ్స్, పెట్టుబడి, రుణాలు, షాపింగ్ సేవలను దశల వారీగా అందించనుంది బ్యాంక్ ఆఫ్ బరోడా. 220కి పైగా సేవలు ఈ యాప్ పైన లభిస్తాయి. 95 శాతం రిటైల్ బ్యాంకింగ్ సేవలను దీని ద్వారా అందించనున్నట్లు తెలిపింది.
పైలట్ ప్రాతిపదికన ఆగస్ట్ 23వ తేదీన బీవోబీ వరల్డ్ ప్రారంభమైందని, ఇప్పటికే 50 లక్షల మందికి పైగా ఖాతాదారులు దీనిని ఉపయోగించారని బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొంది. బీవోబీ వరల్డ్ ద్వారా బ్యాంకు డిజిటల్ ఖాతా తక్షణ వర్చువల్ డెబిట్ కార్డుతో ఈ డిజిటల్ ఖాతాను ప్రారంభం చేయవచ్చునని తెలిపింది. ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారా కొన్ని రకాల రుణాలు వెంటనే పంపిణీ అవుతాయని BoB మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ చాదా తెలిపారు.

అల్ట్రా మోడర్న్ లుక్, ఫీల్‌తో ఈ యాప్ కస్టమర్లకు సహజమైన అనుభూతిని అందిస్తుందని, మిల్లీనియల్స్ వినియోగదారుల అవసరాలకు ఉంటుందని, కస్టమర్లకు కొత్త అనుభూతిని ఇస్తుందని తెలిపింది. అందరికీ నచ్చేలా రూపొందించినట్లు తెలిపింది. bob World పది నిమిషాల్లో డిజిటల్ అకౌంట్ ఓపెనింగ్, తక్షణ వర్చువల్ డెబిట్ కార్డు జారీ, ఎంపిక చేసిన లోన్ ఉత్పత్తుల కోసం తక్షణ ఛార్జీతో ఆన్‌లైన్ లోన్ అప్లికేషన్‌ను అందిస్తోంది. కస్టమర్లకు ఒకే తాటి పైకి బ్యాంకింగ్‌తో పాటు ఈ కామర్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
ఇదిలా ఉండగా, బ్యాంక్ ఆఫ్ బరోడా మెగా ఈ వేలం నిన్న జరిగింది. సొంత ఇల్లు, ఇతర సొంత ఆస్తులు కలిగి ఉండాలని కోరుకునే వారు ఎలాంటి బ్రోకర్లతో సంబంధం లేకుండానే మెగా ఈ-వేలంలో పాల్గొనే సౌకర్యాన్ని కల్పించింది. మెగా ఈ-వేలంలో భాగంగా రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ప్రాపర్టీలను తక్కువ ధరకే కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించింది. వివిధ బ్యాంకులు అప్పుడప్పుడు ఈ-వేలం నిర్వహిస్తాయి. ఈ-వేలం ద్వారా ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. క్లియర్ టైటిల్, ఇమ్మిడియేట్ పొసెషన్, సులభ నిబంధనలతో బ్యాంకు లోన్ వంటివి ఉంటాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications