BNP Paribas Multicap Fund: ఇప్పుడు పెట్టుబడి సాధనాల్లో బాగా ట్రెండీగా మారినవి మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మార్కెట్లలో నేరుగా డబ్బు పెట్టడం కంటే మ్యూచువల్ ఫండ్లను నమ్ముకోవటం మంచిదని చాలా మంది పెట్టుబడిదారులు భావిస్తున్నారు. నిదానమే ప్రధానంగా.. అంటూ దీర్ఘకాలిక వ్యూహాలను కలిగిన వ్యక్తులు తమ డబ్బును వీటిలో పార్క్ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నడూ చూడని స్థాయిలో మ్యూచువల్ ఫండ్ ఇన్ ఫ్లోలను చూస్తున్నాయి.
అయితే ఇక్కడ తన అద్భుతమైన పనితీరుతో ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బీఎన్పీ పరిబాస్ మల్టీక్యాప్ ఫండ్ గురించే. మల్టీక్యాప్ కేటగిరీకి చెందిన ఈ ఫండ్ తన పెట్టుబడిదారులకు గడచిన ఒక్క సంవత్సర కాలంలో 40.29 శాతం రాబడిని అందించి అబ్బురపరిచింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో పతనం కొనసాగుతున్నప్పటికీ ఫండ్ మాత్రం మెరుగైన రాబడిని అందిస్తోంది. వాస్తవానికి ఈ ఫండ్ రెండు దశాబ్ధాల కిందట 2003లో ప్రారంభించబడింది. ఈ కాలంలో చాలా మంది పెట్టుబడిదారులను తన రాబడులతో లక్షాధికారులుగా మార్చేసింది.

వాస్తవానికి ఒక మల్టీక్యాప్ ఫండ్ ఏకకాలంలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీల్లో ఏకకాలంలో పెట్టుబడులు కలిగి ఉంటుంది. మార్కెట్లో పరిస్థితులతో పాటు అనుకూలమైన వాల్యుయేషన్ కలిగిన స్టాక్స్ ఎక్కడ ఉన్నా ఈ ఫండ్స్ గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంది. గడచిన ఏడాది కాలంలో భారతీయ స్టాక్ మార్కెట్ల బుల్ ర్యాలీలో ఫండ్ చురుకైన పనితీరు ఇన్వెస్టర్లకు 40 శాతానికి పైగా రాబడిని తెచ్చిపెట్టింది. స్కీమ్ కింద ప్రస్తుతం రూ.2739 కోట్లు నిర్వహించబడుతున్నాయి. ఫండ్ తన మెుత్తం పెట్టుబడులను వివిధ రంగాల్లోని కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది. రంగాల వారీగా పరిశీలిస్తే.. ఫైనాన్షియల్ 18.3 శాతం, క్యాపిటల్ గూడ్స్ 14.05 శాతం, సర్వీసెస్ 13.73 శాతం, హెల్త్‌కేర్ 9.46 శాతం, కన్స్యూమర్ 7.52 శాతం, ఎనర్జీ 7.1 శాతం, మెటల్ అండ్ మైనింగ్ 5.4 శాతం, టెక్నాలజీ 5.25 శాతం, ఆటోమొబైల్స్ 3.52 శాతం, కెమికల్స్ 2.97 శాతం పెట్టుబడులు కలిగి ఉన్నాయి.
ఎవరైనా ఇన్వెస్టర్ ఫండ్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల ఎస్ఐపీ రూపంలో రూ.7000 పెట్టుబడిగా పెడుతూ వచ్చి ఉంటే దాని మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.కోటికి చేరుకుని ఉండేది. ఈ సమయంలో పెట్టుబడిదారులు పెట్టిన సొమ్ము కేవలం రూ.17.64 లక్షలు మాత్రమే కావటం గమనార్హం. ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో 0.93గా ఉంది.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications