బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్, కొత్తగా 5 రూట్లలో బస్సును ప్రారంభించిన BMTC
బెంగళూరు నగరంలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో BMTC కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) తన ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసును మరింతగా విస్తరించడానికి మరో అడుగు ముందుకు వేసింది. ఇటీవల మాదవర- ఎలక్ట్రానిక్స్ సిటీ మధ్య నైస్ రోడ్‌లో ప్రారంభించబడిన ఈ ఎక్స్‌ప్రెస్ సర్వీసుకు ప్రయాణికుల నుండి మంచి స్పందన వచ్చింది. ఇది విజయవంతమైన నేపథ్యంలో.. BMTC ఇప్పుడు నగర నెట్‌వర్క్‌కు ఐదు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సు మార్గాలను తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది.
కొత్తగా ప్రారంభించబడిన మార్గాలు విషయానికి వస్తే.. మెజెస్టిక్ - అత్తిబెల, బనశంకరి TTMC - అత్తిబెలె, మెజెస్టిక్ - దేవనహల్లి, బనశంకరి TTMC - దేవనహళ్లి, మెజెస్టిక్ - నెలమంగళ ఉన్నాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాలను అనుసంధానించే ఈ ఎక్స్‌ప్రెస్ బస్సులు ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటుగా ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడతాయి. ఇది ప్రయాణికులకు, అలాగే ఇతర రాష్ట్రాల పుండి వచ్చే ప్రయాణీకులకు గొప్ప సౌలభ్యంగా ఉండనుంది.

ప్రయాణికుల ఖర్చును తగ్గించే ప్రయత్నంలో భాగంగా.. BMTC రూ.1,400 ధరతో కొత్త నెలవారీ పాస్‌ను ప్రవేశపెట్టింది. ఈ పాస్‌తో, నైస్ రోడ్‌లో తిరిగే బస్సులతో సహా అన్ని సాధారణ బస్సు సర్వీసులలో అపరిమితంగా ప్రయాణించవచ్చు. ఇది రోజువారీ ప్రయాణికులకు చాలా డబ్బును ఆదా చేస్తుంది. అయితే, ప్రీమియం సేవలు ఈ పాస్ కింద కవర్ చేయబడవు. వజ్ర ఎక్స్‌ప్రెస్ బస్సులలో ప్రయాణం అనుమతించబడుతుంది, కానీ టోల్ ఛార్జీలు విడిగా చెల్లించాలి. అందువల్ల.. సాధారణ ప్రయాణానికి పాస్ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, ప్రీమియం ప్రయాణానికి అదనపు రుసుము అవసరం అవుతుంది.
వారాంతాల్లో నగర ప్రజలకు విశ్రాంతి, వినోదాన్ని అందించే లక్ష్యంతో, BMTC కొత్త ప్యాకేజీ టూర్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ టూర్‌ను ఘాటి మరియు ఇషా ఫౌండేషన్‌కు ఎయిర్ కండిషన్డ్ బస్సులలో నిర్వహించనున్నారు. ఛార్జీ ఒక్కొక్కరికి కేవలం రూ. 600. ప్రయాణం ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు బెంగళూరుకు తిరిగి రావాలని ప్రణాళిక చేయబడింది. అన్ని ఛార్జీలు ఈ ఛార్జీలో చేర్చబడ్డాయి. దీని వలన కుటుంబాలు, స్నేహితులు తక్కువ ఖర్చుతో ఒక చిన్న రోజు పర్యటనను ఆస్వాదించవచ్చు.
ఈ కొత్త మార్గాలు, సేవల ద్వారా నగర రవాణా వ్యవస్థను మెరుగుపరచడం BMTC లక్ష్యం. పెరుగుతున్న వాహన రద్దీ, ఎక్కువ ప్రయాణ సమయాలు మరియు ప్రయాణీకుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికను రూపొందించారు. ఈ సేవలు రోజువారీ ప్రయాణికులు తక్కువ సమయంలో తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి, వారాంతాల్లో చిన్న ప్రయాణాలకు అనుమతిస్తాయి. నగర రవాణా వ్యవస్థలో BMTC తీసుకున్న ఈ అడుగు ప్రయాణీకులకు గొప్ప సౌకర్యాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications