ఢిల్లీ-ఎన్‌సిఆర్, బెంగళూరు సహా ముంబైలో గురువారం ఎలక్ట్రిక్ క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ బ్లూస్మార్ట్ మూతపడింది. దింతో యాప్ పనిచేయక పోవడంతో పాటు బుకింగ్‌లు ఆగిపోయాయి. దింతో వేలాది మంది డ్రైవర్లు, లక్షలాది మంది కస్టమర్లని ఆసౌకర్యానికి గురిచేసింది. ఇటీవల సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) బ్లూస్మార్ట్ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గి అండ్ పునీత్ సింగ్ జగ్గిలపై మనీలాండరింగ్ అభియోగాలు మోపింది. బ్లూస్మార్ట్ పై మరో కంపెనీ జెన్సోల్ ద్వారా నిధులు సేకరించి విలాసాలకు ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జెన్సోల్ బ్లూస్మార్ట్ చెందిన అనుబంధ సంస్థ. అయితే ఈ కంపెనీలో చాలా మంది ప్రముఖులు కూడా పెట్టుబడి పెట్టడం గమనార్షం.

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని జూలై 2024లో బ్లూస్మార్ట్‌లో పెట్టుబడి పెట్టగా, ప్రముఖ బాలీవుడ్ నటి దీపిక కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టింది. వీరితో పాటు బజాజ్ గ్రూప్‌కు చెందిన బడా వ్యాపారవేత్త సంజీవ్ బజాజ్ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసారు. చివరికి BharatPe వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కూడా బ్లూస్‌మార్ట్‌లో రూ. 1.5 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఎక్స్-పోస్ట్‌లో తెలిపారు.
కస్టమర్ల ఆందోళన : చాలా మంది బ్లూస్మార్ట్ కస్టమర్లు బ్లూస్మార్ట్ వాలెట్ల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ట్రిప్ బుక్ కావడం లేదని అలాగే దినికి తోడు వాలెట్లో ఇరుక్కుపోయిన డబ్బును తీసుకోలేకపోతున్నామని X పోస్ట్ ద్వారా తెలిపారు.
కంపెనీ ఏం చెబుతోందంటే : బ్లూస్మార్ట్ 90 రోజుల్లోపు కస్టమర్ల డబ్బును తిరిగి చెల్లిస్తామని ఒక ఇమెయిల్ ద్వారా హామీ ఇచ్చింది. వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము, కానీ 90 రోజుల్లోపు సేవలు పునరుద్ధరించబడకపోతే మేము మీ డబ్బును తిరిగి చెల్లిస్తాము, మీ మద్దతుకి మేము నిజంగా అభినందిస్తున్నాము అని ఇమెయిల్ లో పేర్కొంది.
ప్రస్తుతం, బ్లూస్మార్ట్ యాప్ నిబంధనలు & షరతుల ప్రకారం బ్లూస్మార్ట్ వాలెట్‌లో ఉన్న డబ్బు పూర్తిగా తిరిగి చెల్లించబడదని పేర్కొంటున్నాయి. దీనికి ఎటువంటి కాలపరిమితి లేదు. డబ్బు రిటర్న్ విషయంలో బ్లూస్మార్ట్ యాప్‌లో చేసిన ఏదైనా లావాదేవీకి తిరిగి బ్లూ వాలెట్‌కు మాత్రమే తిరిగి చెల్లించబడుతుంది కానీ బ్యాంక్ అకౌంటుకి కాదు. అయితే కస్టమర్లు బ్లూస్మార్ట్ వాలెట్‌లో డబ్బును తిరిగి పొందడానికి కొన్ని చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఇందుకు కస్టమర్లు బ్లూస్మార్ట్ యాప్ కస్టమర్ సపోర్ట్ టీమ్‌కి ఫిర్యాదు చేసి, డబ్బు రిటర్న్ కోరవచ్చని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: యాపిల్ కంపెనీలో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. కానీ ఈ టెక్కీ ఆటో ఎందుకు నడుపుతున్నాడో తెలుసా?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications