Multibagger Stock: 3 నెలల్లో రూ.లక్షను రూ.2 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్..!
ఒక స్మాల్ క్యాప్ స్టాక్ గత మూడు నెలల రాణిస్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ సెక్టార్ పని చేసే ఈ స్మాల్ క్యాప్ స్టాకా 3 నెల్లలో 112 శాతం రాబడిని ఇచ్చింది. ఈ కంపెనీ షేర్లు శుక్రవారం సెషన్ లో కూడా పెరిగాయి. వేదాంత అల్యూమినియం మెటల్ నుంచి ఈ కంపెనీ అనుబంధ సంస్థకు ఒక ఆర్డర్ లభించిందని ప్రకటించడంతో బ్లూస్ప్రింగ్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు జూలై 3 నాడు 10 శాతం పెరిగి ఒక్కో షేరు ధర రూ.131.82 వద్ద 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మూడు నెలల కాలంలో ఈ స్టాక్ మల్జీబ్యాగర్ గా నిలిచింది.
గత వారం బ్లూస్ప్రింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ 7 శాతం పెరిగింది. గత నెల రోజుల్లో చూసుకుంటే దాదాపు 33 శాతం రాబడిని ఇచ్చింది. ఆరు నెలల్లో బ్లూస్ప్రింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ 85 శాతం రిటర్న్స్ ఇవ్వగా.. సంవత్సర కాలంలో 63 శాతం లాభాన్ని నమోదు చేసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 131.82 ఉండగా.. 52 వారాల కనిష్ట ధర రూ. 43.98 గా ఉంది. ప్రస్తుతం బ్లూస్ప్రింగ్ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ క్యాప్ దాదాపు రూ. 1860 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ ఆర్డర్లు వస్తున్నట్లు ఎక్స్ఛేంజీ ఫైలింగ్ లో పేర్కొంటోంది.

బ్లూస్ప్రింగ్ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధం కంపెనీన స్టీగ్ ఎనర్జీ సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు, వేదాంత అల్యూమినియం మెటల్ లిమిటెడ్ నుండి క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఆర్డర్ వచ్చిందని కంపెనీ వివరించింది. ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కోసం ఒక ఆర్డర్ లభించిందని వివరించింది. రూ.1,437.17 కోట్ల విలువైన ఈ ఆర్డర్‌లో, వేదాంత అల్యూమినియం మెటల్‌లో మొత్తం 1,215 మెగావాట్ల సామర్థ్యం (ఒక్కొక్కటి 135 మెగావాట్ల చొప్పున 9 యూనిట్లు) గల క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం ఒక సమగ్ర ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కూడా ఉన్నట్లు వెల్లడించంది.
ఈ ఒప్పందం 2026 ఆగస్టు 1 నుంచి ప్రారంభమై ఐదేళ్ల పాటు అమలులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. బ్లూస్ప్రింగ్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ఈ ఏడాది ప్రారంభం నుండి బ్లూస్ప్రింగ్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 91% వరకు పెరిగాయి. ఆర్థిక సంవత్సరం 2025 (FY25) నాలుగవ త్రైమాసికంలో రూ.19.74 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసిన కంపెనీ, FY26 నాలుగవ త్రైమాసికంలో రూ.4.12 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ కంపెనీ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ అందించే కంపెనీగా ఉంది. ఈ కంపెనీ 2025వ సంవత్సరంలో క్వెస్ కార్ప్ నుంచి డిమెర్జ్ అయింది.


Click it and Unblock the Notifications