IPO News: ఫార్మా రంగానికి అనుబంధంగా ఉన్న బ్లూజెట్ హెల్త్‌కేర్ తన ఐపీవోను ప్రారంభించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 25న తన ఐపీవోను ప్రారంభిస్తోంది. మెయిన్ బోర్డు విభాగంలో ఈ నెల వస్తున్న రెండవ ఐపీవోగా ఇది నిలుస్తోంది.
బ్లూజెట్ హెల్త్‌కేర్ ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం అక్టోబర్ 25న ప్రారంభమై 27 వరకు తెరచి ఉంటుంది. కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ రూ.329 నుంచి రూ.346గా నిర్ణయించింది. అలాగే బ్లూ జెట్ హెల్త్‌కేర్ అక్టోబర్ 23, 2023న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం తెరవబడుతుంది. తాజా ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు 2.4 కోట్ల షేర్లను విక్రయిస్తున్నారు. అయితే ఎలాంటి ఫ్రెష్ ఇష్యూ ఉండబోదని కంపెనీ ప్రకటించింది.

కంపెనీ తాజా ఐపీవో నుంచి సేకరిస్తున్న మెుత్తాన్ని తన వ్యాపార అవసరాలకు వినియోగించుకోవటం లేదు. ఈ డబ్బు మెుత్తంగా ప్రమోటర్లు పొందనున్నారు. ఎందుకంటే బ్లూజెట్ హెల్త్‌కేర్‌లో అరోరో కుటుంబం తన వాటాను తగ్గించుకుంటోంది. ఈ క్రమంలో లాట్ పరిమాణం 43 షేర్లుగా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లు ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు కనీసం రూ.14,878 వెచ్చించాల్సి ఉంటుంది.
ఐపీవో ద్వారా బ్లూ జెట్ హెల్త్‌కేర్ మార్కెట్ల నుంచి మెుత్తం రూ.840.27 కోట్లను సమీకరిస్తోంది. కంపెనీ ఆర్థిక పనితీరును పరిశీలిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.721 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ కాలంలో పన్నుల తర్వాత నికర లాభం రూ.160 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బ్లూ జెట్ హెల్త్‌కేర్ లాభం రూ.44.10 కోట్లుగా నమోదైంది.
1968లో ప్రారంభమైనప్పటి నుంచి బ్లూజెట్ మూడు విభాగాల్లో ప్రత్యేక రసాయన సామర్థ్యాలతో కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ (CDMO) వ్యాపార నమూనాను ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో మూడు ఉత్పాదక ప్లాంట్లతో సంస్థ అనేక ప్రపంచ, దేశీయ వినియోగదారులకు సేవలను అందిస్తోంది. IPO షెడ్యూల్ ప్రకారం T+6 టైమ్‌లైన్‌గా ఉంది.


Click it and Unblock the Notifications