Blue Dart Stock: మార్కెట్ల మెగా ర్యాలీలో అనేక మల్టీబ్యాగర్ స్టాక్స్ తమ పెట్టుబడిదారులను లక్షాధికారులు, కోటీశ్వరులుగా మార్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు కొత్తగా భవిష్యత్తు కోసం మల్టీబ్యాగర్ షేర్లను వెతికే పనిలో కొనసాగుతున్నారు. అందుకే మార్కెట్లలో సీనియర్ ఇన్వెస్టర్లు ఎల్లప్పుడూ కొత్తగా వచ్చే పెట్టుబడిదారులకు చెప్పే సక్సెస్ మంత్రం దీర్ఘకాలిక పెట్టుబడిని కొనసాగించమనటమే.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బ్లూడార్ట్ కంపెనీ షేర్ల గురించే. నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 7 శాతానికి పైగా లాభపడ్డాయి. మార్కెట్ల ముగింపు సమయంలో బ్లూడార్ట్ కంపెనీ షేర్ల ధరను పరిశీలిస్తే ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.8,601 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో కంపెనీ షేర్లు గరిష్ఠంగా రూ.8,792.50 మార్కును చేరుకున్నాయి. నేడు కంపెనీ షేర్ల పెరుగుదల వెనుక పెద్ద ప్రకటనే ఉంది. జనవరి 1, 2025 నుంచి కంపెనీ ఛార్జీలను 9 నుంచి 12 శాతం మేర పెంచాలని నిర్ణయించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.

220 కంటే ఎక్కువ దేశాలకు సేవలను విస్తరించిన DHL గ్రూప్‌లో భాగమైన రవాణా & పంపిణీ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ కంపెనీ షిప్పింగ్ చేస్తున్న వస్తువులు లేదా సరకులకు అనుగుణంగా ఈ రేట్ల పెంపు ఉండబోతున్నట్లు వెల్లడించింది. ఈ ధరల పెంపుపై సమగ్ర వార్షిక సమీక్షను నిర్వహిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ధరల పెంపు నిర్ణయం వచ్చింది. దీనికి తోడు ఎయిర్‌లైన్ నిర్వహణ ఖర్చులు, మౌలిక సదుపాయాల ఖర్చులతో సహా కార్యకలాపాలకు పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు వంటి దీర్ఘకాలిక వ్యయాలను కవర్ చేసే విధంగా ధరల నిర్మాణం చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది.
కంపెనీ ప్రస్తుతం దక్షిణాసియాలోని ప్రముఖ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ఎక్స్‌ప్రెస్ క్యారియర్, ప్రీమియం లాజిస్టిక్స్ ప్రొవైడర్ గా కొనసాగుతోంది. బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ దేశంలో 55,000 లొకేషన్లకు డెలివరీ సేవలను అందిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.53.42 కోట్ల లాభాన్ని నివేదించింది. అయితే ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.61.28 కోట్లతో పోల్చితే 12.8 శాతం తక్కువ కావటం గమనార్హం.
లక్షను కోటి చేసిన స్టాక్..
బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ షేర్లు గత ఆరు నెలల్లో పెట్టుబడిదారులకు 42% రాబడిని అందించాయి. అలాగే 2024లో ఇప్పటి వరకు దాదాపు 20 శాతం పెరుగుదలను చూశాయి. ఇక దీర్ఘకాలిక పెట్టుబడిదారులు మాత్రం మంచి రాబడులను అందుకున్నారు. 5 ఏళ్ల కాలంలో ఇన్వెస్టర్లు 280 శాతం రాబడిని అందుకున్నారు. అయితే జూలై 5, 2002లో కంపెనీ షేర్ ధర కేవలం రూ.83 వద్ద ఉంది. అప్పట్లో షేర్లలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు ఇప్పటి వరకు దానిని కొనసాగించి ఉంటే మార్కెట్ ధర ప్రకారం వారి పెట్టుబడి విలువ ఏకంగా రూ.కోటికి చేరుకుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.21 వేల కోట్లుగా ఉంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications