IPO News: డబుల్ కంటే ఎక్కువ లాభం.. బ్లాస్టింగ్ ఐపీవో.. తొలిరోజే ఊహించని దూకుడు..
BLS e-Services IPO: దేశంలోని ఐపీవోల కోలాహలం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. వరుసగా ఇటీవల వస్తున్న ఐపీవోలు కళ్లు చెదిరే లాభాలకు లిస్టింగ్ నమోదు చేస్తూ ఐపీవో బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్ల ఆనందానికి అవదులు లేకుండా చేస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బీఎల్‌ఎస్ ఈ-సర్వీసెస్ కంపెనీ షేర్ల గురించే. ఐపీవో షేర్లు తొలిరోజే మార్కెట్‌లో తన లాభాలతో ప్రకంపనలు సృష్టించింది. కంపెనీ షేర్లు మార్కెట్‌లోకి ప్రవేశించిన వెంటనే ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు చేసేసింది. కంపెనీ షేర్లు బీఎస్ఈలో నేడు 129 శాతం ప్రీమియం రేటు రూ.309 వద్ద జాబితా అయ్యాయి. దీంతో ఇష్యూ ద్వారా షేర్లను పొందిన పెట్టుబడిదారులు ఒక్కో షేరుపై దాదాపు రూ.135 లాభంగా అందుకున్నారు. ఇదే సమయంలో స్టాక్ ఎన్ఎస్ఈలో 126 శాతం ప్రీమియం ధర అయిన రూ.305కి జాబితా చేయబడింది. గరిష్ఠంగా స్టాక్ రూ.348 రేటును తాకింది.

ఐపీవో షేర్లు లిస్టింగ్ అయిన వెంటనే కొనుగోళ్ల డిమాండ్ కోలాహలంతో విపరీతమైన పెరుగుదల నమోదైంది. ఈ క్రమంలో కంపెనీ షేర్లు 8 శాతానికి పైగా ఎగబాకి రూ.333.95కి చేరుకున్నాయి. అలా పెట్టుబడాదారులు బీఎల్‌ఎస్ ఈ-సర్వీసెస్ ఐపీవోలో పెట్టుబడిదారులు భారీ ప్రయోజనాలను పొందారు. వాస్తవానికి రిటైల్ పెట్టుబడిదారుల కోసం జనవరి 30న ప్రారంభమైన ఐపీవో ఫిబ్రవరి 1న సబ్‌స్క్రిప్షన్ ముగించింది. అలాగే కంపెనీ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.129-135గా ప్రకటించిన సంగతి తెలిసిందే. చివరిగా ఐపీవో దరఖాస్తుదారులకు కంపెనీ షేర్లను గరిష్ఠ ఇష్యూ రేటు రూ.135 వద్ద షేర్లను అలాట్ చేసింది.
కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా తన వ్యాపార మూలధన అవసరాల కోసం రూ.310.91 కోట్లను విజయవంతంగా సమీకరించింది. బీఎల్‌ఎస్ ఈ-సర్వీసెస్ ఐపీవో మొత్తం 162.38 సార్లు సభ్యత్వం పొందింది. కంపెనీ ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో 236.53 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 300.05 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల కోటా 123.30 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.


Click it and Unblock the Notifications