IPO News: గ్రేమార్కెట్లో ఐపీవో తుఫాను.. పెట్టుబడికి అవకాశం ఎప్పటి నుంచి అంటే..?
Trending IPO: జనవరి చివరిలో వరుస ఐపీవోలు మార్కెట్లోకి క్యూ కడుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు సైతం భారీ లాభాలను పొందేందుకు పందెం వేసేందుకు డబ్బును సిద్ధంగా ఉంచుకుంటున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది BLS E-Services ఐపీవో గురించే. మీరు ఈ ఐపీవోలో బెట్టింగ్‌లు వేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. మొదటి రోజునే లాభాలను పొందే అవకాశం ఉంది. రానున్న వారంలో ప్రారంభం అవుతున్న ఐపీవో జనవరి 30న రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరచుకుని ఫిబ్రవరి 1న ముగియనుంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఒక్కో ఈక్విటీ షేర్‌కి రూ.129-135గా నిర్ణయించబడింది.

మెయిన్ బోర్డు ఐపీవోగా వస్తున్న కంపెనీ మార్కెట్ల నుంచి తన మూలధన అవసరాల కోసం రూ.310.91 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్వెస్టర్లు ఐపీవోలో పాల్గొనేందుకు లాట్ పరిమాణాన్ని కంపెనీ 108 షేర్లుగా నిర్ణయించింది. అయితే షేర్ కేటాయింపును 2 ఫిబ్రవరి 2024న అంటే వచ్చే వారం శుక్రవారం ఖరారు చేయవచ్చు. కంపెనీ షేర్లు లిస్టింగ్ రోజున బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఏకకాలంలో జాబితా అవుతాయని కంపెనీ వెల్లడించింది.
బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ప్రారంభ తేదీ కంటే ముందు గ్రే మార్కెట్‌లో బలమైన లాభాన్ని చూస్తున్నాయి. స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారంగ్రే మార్కెట్‌లో BLS E-సర్వీసెస్ షేర్ ధర నేడు రూ.160 ప్రీమియంతో కొనసాగుతోంది. దీని ప్రకారం పెట్టుబడిదారులు లిస్టింగ్ రోజునే మల్టీబ్యాగర్ రాబడులను పొందుతారని తెలుస్తోంది. ఈ లెక్కన మార్కెట్లో జాబితా రోజున ఒక్కో షేరు రేటు రూ.295గా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే మెుదటి రోజే 119 శాతం లాభం ఇన్వెస్టర్లు పొందనున్నారు.


Click it and Unblock the Notifications