అదానీ గ్రూపుకు భారీగా దెబ్బేసిన హిండెన్ బర్గ్ రిపోర్ట్.. 6 నెలల్లో ఎంత సంపంద కోల్పోయిందో తెలుసా?
Adani: అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ నివేదిక విడుదలైనప్పటి నుంచి అదానీ గ్రూపు ఏ విధంగా నష్టాలపాలైందో అందరికీ తెలుసు. అయితే పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి ఆ సంస్థ చేయని పనులు లేవు. వేలాది కోట్ల రుణాలను సైతం తిరిగి చెల్లించింది. ప్రస్తుతం నిధుల కొరతతో ఇబ్బంది పడుతోంది.
జనవరిలో ఈ నివేదిక విడుదల కాగా.. గత 6 నెలల్లో దాదాపు 4 లక్షల కోట్లకు పైగా సంపదను అదానీ గ్రూపు కోల్పోయినట్లు బ్లూమ్ బెర్గ్ నివేదించింది. అకౌంటింగ్ మోసాలు, స్టాక్ మార్కెట్ మ్యానిప్యులేషన్లకు పాల్పడిందని ఆరోపించిన జనవరి 27న.. ఇప్పటి వరకు ఏ బిలియనీర్ ఓ రోజులో చూడని అతిపెద్ద నష్టాన్ని కంపెనీ నమోదు చేసిందని స్పష్టం చేసింది. ఏకంగా 20.8 బిలియన్ డాలర్లమేర సంపద కోల్పోయినట్లు పేర్కొంది.

హిండెన్ బర్గ్ ఆరోపణనలను అదానీ గ్రుపు అప్పుడే ఖండించింది. అనంతరం ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టు ఓ నిపుణుల కమిటీని సైతం నియమించింది. అయితే అవన్నీ ఆరోపణలేనని, ఇప్పటి వరకు ఎనలైజ్ చేసిన సమాచారాన్ని బట్టి చూస్తే ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆధారాలు లభించలేదని ఆ ప్యానెల్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది.
జూన్ 27న అదానీ ఫ్లాగ్‌షిప్ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వార్షిక నివేదికలో సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్ నివేదికను ప్రస్తావించారు. తమ సంస్థల నుంచి ఎటువంటి వైఫల్యాలు లేవని అందులో పేర్కొంది. తమ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి, అపఖ్యాతి పాలు చేయడానికే ఉద్దేశపూర్వకంగా బురద చల్లారని వెల్లడించింది.


Click it and Unblock the Notifications