సెన్సెక్స్ 1189 పాయింట్లు డౌన్, ఒక్కరోజులో లక్షల కోట్ల సంపద ఆవిరి

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఓ సమయంలో 1800 పాయింట్లకు పైగా నష్టపోయింది సెన్సెక్స్. ఆ తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ, భారీ నష్టాల్లోనే ముగిసి, ఇన్వెస్టర్లకు షాకిచ్చింది. సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 57,011 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. అయితే నేడు ప్రారంభంలోనే 500 పాయింట్ల నష్టంతో 56,517 వద్ద ఆరంభించింది. 56,538 వద్ద గరిష్టాన్ని తాకింది. అంటే ఏ సమయంలోను కనీసం క్రితం సెషన్ ముగింపును తాకలేదు. పైగా 500 పాయింట్ల నష్టంతోనే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా 16,600 పాయింట్ల వద్ద ముగిసింది.

మార్కెట్ నష్టానికి కారణాలు

మార్కెట్ నష్టానికి కారణాలు

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ఒమిక్రాన్ పెరుగుదల, ద్రవ్యోల్బణ భయాలు సూచీలపై భారీ ప్రభావాన్ని చూపించాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు మార్కెట్లను కుదిపేశాయి. 1000 పాయింట్లకు పైగా ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్ అంతకంతకు దిగజారింది. మధ్యాహ్నం గం.1 సమయంలో సెన్సెక్స్ 1800 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ కూడా 500 పాయింట్లకు పైగా పతనమైంది.

అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు మార్చి నాటికి పెంచడంపై అధికారులు బహిరంగంగా సంకేతాలు ఇవ్వడంతో మిగిలిన మార్కెట్ నుండి నిధుల మళ్లింపు మొదలైంది. ఈ ఏడాదిలో అత్యుత్తమ స్థాయికి డాలర్ ఇండెక్స్ చేరింది. ఇది శుక్రవారం 0.7 శాతం పెరిగింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా పెరుగుతున్న ద్రవ్యోల్భణానికి అడ్డుకట్ట వేయడానికి బాండ్స్ కొనుగోళ్లను తగ్గించింది. దీంతో వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్లు పెంచి 0.25 శాతానికి చేర్చింది. ఇటీవలి కాలంలో తొలిసారి వడ్డీ రేట్లు పెంచింది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. త్వరలో ఫెడ్ ఇదే దారిలో వెళ్తుంది.

ఒమిక్రాన్ భయాలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. అమెరికన్లు బూస్టర్ షాట్లు తీసుకోవాలని ఇటీవల ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.

ఐరోపా దేశాల్లో మరోసారి లాక్ డౌన్ దిశగా సాగుతోంది. వ్యాపారాలు దెబ్బతింటాయనే ఆందోళన వ్యాపారులను కలవరపరుస్తోంది.

స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీల విక్రయాలు జోరుగా సాగాయి.

ఆసియా మార్కెట్లు కూడా నష్టపోయాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా విక్రయాలు జరిపారు.

వివిధ రంగాలు..

వివిధ రంగాలు..

నిఫ్టీ బ్యాంకు 3.31 శాతం, నిఫ్టీ ఆటో 2.56 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.90 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.97 శాతం, నిఫ్టీ ఐటీ 2.00 శాతం, నిఫ్టీ మీడియా 3.94 శాతం, నిఫ్టీ మెటల్ 3.78 శాతం, నిఫ్టీ ఫార్మా 0.35 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 4.48 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 3.28 శాతం, నిఫ్టీ రియాల్టీ 4.90 శాతం, నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్స్ 0.53 శాతం, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 2.23శాతం, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 3.62 శాతం నష్టపోయాయి.

మార్కెట్లు భారీగా నష్టపోవడంతో మధ్యాహ్నం ట్రేడింగ్ సమయానికి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10 లక్షల కోట్లకు పైగా తగ్గింది.

టాప్ లూజర్స్, గెయినర్స్

టాప్ లూజర్స్, గెయినర్స్

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో HDFC బ్యాంకు, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో సిప్లా, HUL, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో బీపీసీఎల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+