Market Crash: మార్కెట్లలో రక్తపాతం.. తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. రూ.12 లక్షల కోట్లు మిస్..
Stock Market Crash: ఈ రోజు నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గంటలు గడిచే కొద్దీ నష్టాలను పెంచుకుంటూ పోయింది. దీంతో మార్కెట్లలో బ్లడ్ బాత్ కొనసాగింది. ఒక్కసారిగా బేర్ల చేతిలో మార్కెట్ భారీ నష్టాల దిశగా ప్రయాణాన్ని కొనసాగించింది. ప్రధానంగా దీనికి 5 కారణాలు ఆజ్యం పోశాయి.

కుప్పకూలిన సూచీలు..
రెండు రోజులుగా మార్కెట్లు నష్టాలను నమోదు చేయటం వల్ల రూ.12 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బడ్జెట్ కి ముందు జరిగిన బ్లడ్ బాత్ లో సెన్సెక్స్ సూచీ 875 పాయింట్లు, నిఫ్టీ సూచీలో 287 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 1302 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 452 పాయింట్లు కోల్పోయాయి. ఐటీ, కన్జూమర్ సర్వీసెస్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికమ్యూనికేషన్, ఆటో రంగాల్లోని కంపెనీల షేర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ప్రభావం చూపుతూ..
మరికొద్ది రోజుల్లో కేంద్రం తన వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. దీనికి ముందర మార్కెట్ కరెక్షన్ జరుగుతోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి తోడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటం కూడా కారణంగా ఉంది. దీనికి తోడు ఆర్థిక లోటు పెరుగుదల, జీడీపీ వృద్ధి అంచనాలను 2024కు 5.9 శాతంగా ఉండొచ్చని మోర్గన్ స్టాన్లీ అంచనా వేయటం కూడా మరో కారణంగా ఉంది.

అదానీ డ్రాగ్ డౌన్..
హిండెన్ బర్గ్ అదానీ గ్రూప్ పై ఇచ్చిన నివేదికను గౌతమ్ అదానీ తిప్పికొట్టినప్పటికీ ఇన్వెస్టర్లలో నమ్మకం నింపలేకపోయిందని చెప్పుకోవాలి. గ్రూప్ కు చెందిన అన్ని కంపెనీలు భారీగా నష్టాలను నమోదు చేశాయి. దీంతో అదానీ కంపెనీల విలువ లక్ష కోట్లకు పైగానే కరిగిపోయింది.

ఫెడ్ నిర్ణయాలు..
US ఆర్థిక వ్యవస్థ 2022 అక్టోబర్-డిసెంబర్‌లో 2.9 శాతం వార్షిక రేటుతో వృద్ధి చెందింది. దీనికి తోడు ఫిబ్రవరిలో ఫెడ్ తన వడ్డీ రేట్ల పెంపులో కొంత సమ్యమనాన్ని పాటిస్తుందని తెలుస్తోంది. మాంద్యం ప్రమాదం సైతం నెమ్మదించినట్లు తెలుస్తోంది. ఫెడ్ తీసుకోబోయే నిర్ణయాలు కూడా మార్కెట్లపై ఉండనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications