Stock Market: దలాల్ స్ట్రీట్‌లో రక్తపాతం.. రూ.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి..
Stock Market: ఈరోజు ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు అదే ధోరణిని కొనసాగించాయి. ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడి కొనసాగటం వల్ల భారీగా నష్టాలను నమోదు చేసింది.
మార్కెట్ల క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 677 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 207 పాయింట్లు కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 597 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 501 పాయింట్లను కోల్పోయాయి. ప్రధానంగా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ట్రేడింగ్ ముగించాయి.

ఈరోజు ట్రేడింగ్‌లో అన్ని రంగాల షేర్లు క్షీణించాయి. బ్యాంక్ నిఫ్టీ 1.21 శాతం, ఎనర్జీ 1.61 శాతం, ఆటో 1.64 శాతం, ఐటీ 0.81 శాతం, ఫార్మా 0.19 శాతం, మెటల్ 2.01 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.24 శాతం, స్మాల్ క్యాప్ 1.73 శాతం నష్టాన్ని నమోదు చేశాయి. మార్కెట్ల క్షీణతతో ఇన్వెస్టర్లు రూ.5 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయారు. రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ అమెరికా సావరిన్ రేటింగ్‌ను తగ్గించిందనే వార్తలు మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించటమే పతనానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మార్కెట్లు ముగిసే సమయంలో దివీస్ ల్యాబ్, నెస్లే, హిందుస్థాన్ యూనీలివర్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు మాత్రమే లాభాలతో టాప్ గెయినర్లుగా ప్రయాణాన్ని ముగించాయి. ఇదే క్రమంలో హీరో మోటార్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, ఐషర్ మోటార్స్, హిందాల్కొ, కోల్ ఇండియా, ఎల్ టిఐఎమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, బీపీసీఎల్, బజాజ్ ఆటో, టాటా కన్జూమర్, ఎయిర్ టెల్, ఎస్బీఐ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications