IPO News: బ్లాక్ బస్టర్ IPO బంపర్ హిట్.. దాదాపు 500 రెట్లు సబ్‌స్క్రిప్షన్.. ఇన్వెస్టర్స్‌కు ఊర మాస్ ప్రాఫిట
Bumper IPO: గత కొంతకాలంగా మార్కెట్లో లిస్ట్ కాబడిన IPOలు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. తాజాగా ఇవాళ జాబితా చేయబడిన కంపెనీ కూడా అదే స్థాయిలో ప్రాఫిట్స్ ఇచ్చింది. కాగా తొలిరోజే అప్పర్ సర్క్యూట్‌ను టచ్ చేసి ఆసక్తి రేకెత్తించింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పెర్ఫార్మ్ చేసింది. దీంతో పెట్టుబడిదారుల నుంచి IPOలకు క్రేజ్ తగ్గలేదని మరోసారి రుజువైంది.
స్టాక్ మార్కెట్లు పతనమైనప్పటికీ ప్యాకేజింగ్ మెటీరియల్ తయారీ కంపెనీ సతీ పాలీ ప్లాస్ట్ సంచలనం సృష్టించింది. ఒక్కో షేరు IPO ధర 130 కాగా.. ఇవాళ 247 వద్ద NSE SME విభాగంలో లిస్ట్ చేయబడ్డాయి. అంటే 90 శాతం ఎక్కువకు జాబితా చేయబడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లిస్టింగ్ తర్వాత 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి 259.35 చేరి ఔరా అనిపించాయి.

మార్కెట్ నిపుణుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సతీ పాలీ ప్లాస్ట్ లిస్ట్ కాబడింది. IPO గ్రే మార్కెట్ ప్రీమియం ఒక్కో షేరు ధర 140 కాగా అంచనా లిస్టింగ్ వెల 270గా నిర్ణయించబడింది. ఇష్యూ ధర కంటే ప్రీమియం 107.69 శాతం ఎక్కవ. జూలై 12న ప్రారంభమైన సబ్‌స్క్రిప్షన్ జూలై 16తో ముగిసింది. IPO కేటాయింపు జూలై 18న ఖరారు చేయబడగా.. ఈరోజు మార్కెట్‌లో జాబితా చేయబడింది.
సతీ పాలీ ప్లాస్టిక్ కంపెనీ పలు పరిశ్రమల ప్యాకేజింగ్ అవసరాలను తీర్చే మెటీరియల్‌ను తయారు చేస్తుంది. వివిధ ప్యాకేజింగ్ అవసరాలకు పూర్తి పరిష్కారాలను అందిస్తుంది. 2015 వరకు కంపెనీ ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లో మాత్రమే ఉండగా.. 2017 నుంచి పూర్తిస్థాయి తయారీని ప్రారంభించింది. 13.35 లక్షల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూతో కంపెనీ 17.36 కోట్లను సేకరించింది. IPO రిటైల్ విభాగంలో 670 రెట్లు, QIBలో 146, NIIలో 569 రెట్లు సబ్‌స్క్రైబ్ కాబడింది. మొత్తం మీద 499 రెట్లతో ఇన్వెస్టర్ల నుంచి గట్టి స్పందన లభించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications