ఏదైనా ఆన్‌లైన్లో ఆర్డర్ చేయాల.. ? ఎ యాప్ బెస్ట్.. ఇంటర్నెట్లో హాట్ హాట్ టాపిక్..!!

స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి ఆన్‌లైన్ స్టోర్స్ ప్రజల జీవితాలను గతంలో కంటే చాలా సింపుల్ అండ్ ఈజీ చేసాయి. ఇప్పుడు ప్రజలు ఇంటి నుండే హాయిగా కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేయవచ్చు అంతేకాదు నిమిషాల్లో ఇంటికి డెలివరీ పొందవచ్చు. గతంలోలాగ బయటికి వెళ్లి షాపులో కిరాణా సామాగ్రి కొనే ఇబ్బందిని తగ్గిస్తుంది. ఏదైనా అత్యవసర సమయంలో వెంటనే షాపుకి వెళ్లలేని వారికి ఇన్స్టంట్ డెలివరీ యాప్‌లు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి యాప్‌ల వల్ల ప్రజలు చాలా ప్రయోజనం పొందుతున్నప్పటికీ, ఆన్‌లైన్ గ్రోసరీ షాపింగ్ ఫెసిలిటీ మనం అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే విధానంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది.

ఆ విషయంలో మూడు ఇ-కామర్స్ యాప్స్ బ్లింగిట్, జెప్టో అండ్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్'లని లక్షల మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఈ యాప్‌లు నిమిషాల్లో మీ ఆర్డర్‌లను డెలివరీ చేస్తామని పేర్కొంటున్నాయి. అదేవిధంగా బిగ్‌బాస్కెట్ భారతదేశంలో ఒక పాపులర్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్. అయితే ఒక రెడ్డిట్ యూజర్ తన సోషల్ నెట్‌వర్కింగ్ పేజీలో ఈ యాప్స్ లాభాలు ఇంకా నష్టాల గురించి ఒక పోస్ట్‌ను షేర్ చేశాడు.

Blinkit Zepto Or BigBasket Which app is better for online orders check this Trending Topic on Internet

అందులో జెప్టో ప్లాట్‌ఫామ్ కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ ఆఫర్‌లను అందించడంలో ప్రత్యేకంగా నిలుస్తుందని, బ్లింగిట్ ఉత్పత్తుల కొరత అలాగే అధిక ధరల కారణంగా వెనుకబడి ఉందని ఆయన పేర్కొన్నారు. దీనితో పాటు ఆన్‌లైన్ గ్రోసరీ షాపింగ్ నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి యూజర్ టిప్స్ షేర్ చేసాడు. అందులో ముందుగా ధరలను పోల్చడం, తరువాత 15-20 నిమిషాలలో డెలివరీ అందించేదాన్ని సెలెక్ట్ చేసుకోవడం, ఇలా మీకు అనుకూలమైన యాప్ నుండి ఆర్డర్ చేయండి అని ఆయన పేర్కొన్నారు. మీరు ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్ షాపింగ్‌కు కూడా సపోర్ట్ చేసే వారైతే ధరలను పోల్చి ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చని కూడా సలహా ఇచ్చారు.

దీని తర్వాత మొత్తం డిస్కౌంట్ పైన క్యాష్‌బ్యాక్ అందించే క్రెడిట్ కార్డుల గురించి రెడ్డిట్ యూజర్ మాట్లాడారు. బిగ్‌బాస్కెట్‌ను తక్కువ అంచనా వేయకండి, ఇందులో ఉత్పత్తులు చాలా తక్కువ ధరలకు లభిస్తాయి అని అన్నారు. ఫిబ్రవరి 9న షేర్ చేసిన ఈ పోస్ట్‌కు 250 మందికి పైగా లైక్స్ వచ్చాయి. మరొక యూజర్ "డ్యూడ్, ఇది కేవలం కస్టమర్‌ను ఆకర్షించడానికి ఒక పద్ధతి, 5 నుండి 7 సార్లు ఆర్డర్‌లు చేసాక అప్పుడు ప్రతిదీ ఎక్కువ ధరకు చూపిస్తుంది" అని అన్నారు. ఇంకొక యూజరైతే "నేను 2023 నుండి ఇలా షాపింగ్ చేస్తున్నాను, అంటే నేను ప్రతి 10-15 రోజులకు Zomato, Instamart అండ్ Blinkit లను అల్తర్నేటివ్ గా ఉపయోగిస్తున్నాను, ప్రతిసారీ నాకు డిస్కౌంట్ కోడ్ వస్తుంది అని అన్నారు. చివరగా కూరగాయలు తప్ప MRP ఉత్పత్తులపై ఫిక్స్డ్ ధర ఇంకా ఆన్‌లైన్‌లో బెస్ట్ ధర ఉండేటివి లేవని ఓ యూజర్ పోస్ట్ చేశారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+