Blinkit Grapes: ఇప్పుడు చాలా మందికి ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులు డెలివరీ అయ్యే సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. తాజాగా రెడిట్‌లో ఒక పోస్ట్ మరోసారి ఈ సమస్యలను ముందుకు తీసుకొచ్చింది. బ్లింకిట్ అనే క్విక్ కమర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా చేసిన ఒక ఆర్డర్ పై వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే సదరు యూజర్ ఆర్డర్ చేసిన ద్రాక్ష తక్కువగా పొందినట్లు గ్రహించాడు. దీంతో ఆగ్రహించిన సదరు యూజర్ బ్లింకిట్ సేవలను విశ్వసించవద్దని పేర్కొన్నాడు. తాను రెండు వారాల క్రితం బ్లింకిట్ నుంచి ద్రాక్ష ఆర్డర్ చేసినప్పుడు ప్యాకెట్ చాలా తక్కువ బరువుగా అనిపించిందన్నాడు. వాస్తవానికి తాను 500 గ్రాములకు ఆర్డర్ డబ్బు చెల్లించగా.. వచ్చింది కేవలం 370 గ్రాముల బరువు రావటంతో దానిని ఫోటో తీశాడు. మొదటిసారిగా ఈ లోపాన్ని వారు ఒక చిన్న తప్పిదంగా భావించారు. కానీ తర్వాత మరొక 500 గ్రాముల ప్యాకెట్లో కూడా 395 గ్రాములు మాత్రమే యూజర్ అందుకున్నాడు. ఈ సంఘటనను వారికీ జాగ్రత్తగా చూడాలని సూచించారు.

ఇప్పటివరకు వారు అనుభవించిన అనేక సమస్యలను కూడా యూజర్ వివరించారు. మునుపటి ఆర్డర్‌లలో తక్కువ నాణ్యత కలిగిన పండ్లు, కూరగాయలు, ఇతర అత్యధిక ధరల్లో విక్రయించబడే ఉత్పత్తులు కూడా ఉన్నట్లు చెప్పారు. ఈ పద్ధతులు కస్టమర్లను మోసం చేయడమే లక్ష్యంగా రూపొందించబడినవని భావిస్తున్నట్లు సదరు యూజర్ పేర్కొన్నాడు. వాస్తవానికి ఇది యాదృచికంగా జరిగిందని తాను భావించటం లేదని తన పోస్టులో సదరు యూజర్ పేర్కొన్నాడు. ఇదే క్రమంలో జరిగిన తప్పును అంగీకరించని బ్లింకిట్ మీరు ఎప్పటికప్పుడు ఆర్డర్ చేసిన వస్తువుల బరువు లేదా నాణ్యతను జాగ్రత్తగా తనిఖీ చేయాలని పేర్కొంది.
ఈ పోస్ట్‌పై వచ్చిన ఇతర రేడిట్ వ్యాఖ్యలు కూడా సమర్థించాయి. ఒక యూజర్ కామెంట్ చేస్తూ.. వినియోగదారులు తమ హక్కుల్ని రక్షించుకోవడానికి చట్టపరంగా యత్నించాలని సూచించారు. అయితే మరొకరు తమ అనుభవాన్ని పంచుకుంటూ ఒక పెద్ద ఆర్డర్ చేసినప్పుడు కొంతమంది వస్తువులు తప్పిపోయాయని, "ఫిర్యాదు చేసినప్పుడు మీరు రీప్లేస్‌మెంట్ లేదా రీఫండ్ పొందుతారు. కానీ మన దేశంలో వినియోగదారుల హక్కులు చాలా బలహీనంగా ఉన్నాయన్నారు. బ్లింకిట్ సంస్థ ఈ ఆరోపణలపై ఇప్పటివరకు ప్రజలకు ఎలాంటి ప్రాధాన్యమైన స్పందనను ఇవ్వలేదు.
సపోర్ట్‌కి ఫిర్యాదు చేయడం వంటి చిట్కాలు ఇచ్చారు. అందువల్ల, వినియోగదారులు తమ డెలివరీ లలో ఉన్న లోపాలను తట్టుకోవడం లేక వారి అనుభవాలను పంచుకోవడం అనే ప్రక్రియలను కొనసాగించడం చాలా ముఖ్యం. విదేశాల్లాగే మనదేశంలో కూడా డిజిటల్ ఆర్డర్‌ల మీద ఆధారపడి జీవిస్తున్న వినియోగదారులకు ఇటువంటి పునరావృత సమస్యలు సమస్యాత్మకంగా మారుతున్నాయి. దేశంలో వినియోగదారుల చట్టాలను మరింతగా బలోపేతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై కంపెనీ స్పందిస్తూ జరిగిన తప్పుకు సారీ చెప్పింది. తమను సంప్రదించటం ద్వారా సమస్యను పరిష్కరిస్తామని వాగ్ధానం చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications