Rakhi News: కస్టమర్లకు త్వరితగతిన సేవలందించేందుకు దూసుకుపోతున్న క్విక్ కామర్స్ రంగంలో కొత్తదనాన్ని పరిచయం చేయాలని ఆయా సంస్థలు ఉవ్విళ్లూరుతున్నాయి. మంచి గ్రోత్ అవకాశాలు ఉండటంతో ఇ-కామర్స్ సంస్థలు కూడా ఈ విభాగంలో సత్తా చాటేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఫుడ్ డెలివరీ యాప్స్ గా ప్రస్థానం ప్రారంభించిన స్విగ్గీ, జొమాటోలు ఓ అడుగు ముందుగానే ఈ రంగంలోకి ప్రవేశించాయి. ఏవైనా పండుగలు, ప్రత్యేక రోజుల్లో కొత్త ఐడియాలతో యూజర్ల మనసు దోచుకుంటున్నాయి.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగను పురస్కరించుకుని బ్లింకిట్ కీలక ప్రకటన చేసింది. పనిభారం సహా ఇతర కారణాలవల్ల విదేశాల్లో ఉండి నేరుగా తమ తోబుట్టువులతో కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకోలేని వారికోసం కొత్త ఐడియాతో ముందుకొచ్చింది. 6 దేశాల్లోని వ్యక్తులు తమ సోదరసోదరీమణులకు రాఖీలు సహా గిఫ్ట్స్ ఆర్డర్ చేసి పంపించేందుకు వినూత్న ఫీచర్ తీసుకొచ్చింది. ఈ అవకాశం 17 నుంచి 19 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ CEO అల్బిందర్ ధిండ్సా X వేదికగా వెల్లడించారు.

US, కెనడా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశాల్లోని వ్యక్తులు ఆర్డర్ చేసే ఉత్పత్తులను కేవలం 10 నిమిషాల్లోనే తమ తోబుట్టువులకు ఇండియాలో అందిస్తామని సంస్థ హామీ ఇచ్చింది. ఇక భారత్‌లో తయారు చేయబడిన రాఖీలను ఎటువంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో కంపెనీ తీసుకున్న చొరవను పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇ-కామర్స్, క్విక్ కామర్స్ సంస్థలు గతంతో పోలిస్తే కస్టమర్ సెంట్రిక్ గా పనిచేస్తున్నాయని కితాబిస్తున్నారు.
ఇక దేశీయ క్విక్ కామర్స్ విభాగం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుందని చెప్పడానికి బ్లింకిట్ ఉదాహరణగా చెప్పవచ్చు. జొమాటో యాజమాన్యంలోని ఈ కంపెనీ తన మాతృ సంస్థ లాభాల్లో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 2,416 కోట్ల నిర్వహణ ఆదాయంతో పోలిస్తే Q1 2024లో 74.1 శాతం వృద్ధితో ఏకంగా 4,200 కోట్లకు చేరింది. ఇందులో బ్లింకిట్ వాటా ఎక్కువగానే ఉన్నట్లు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications