Subramanian Swamy: GDP గణాంకాలపై నిప్పులు చెరిగిన సుబ్రమణ్యస్వామి.. ఏమన్నారంటే..?
Subramanian Swamy: భారతదేశ ప్రస్తుత ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే ఇండియా ప్రకాశిస్తోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవి నిరాధారమైనవని బీజేపీ సీనియన్ నేత సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరోనా నుంచి రికవరీ రేటు నుంచి జీడీపీ వృద్ధి రేటును తీసివేస్తే వృద్ధి కేవలం 4 శాతమేనని ట్విట్టర్ వేధికగా వెల్లడించారు. ఈ రేటు నెహ్రూ కాలంలో సాధించినదని వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత GDP 6.1 శాతం చొప్పున వృద్ధి చెందిందనట్లు గతవారం గణాంకాలు విడుదలయ్యాయి. అలాగే వార్షిక GDP వృద్ధి రేటును తాజాగా 7.2 శాతానికి ప్రభుత్వం పెంచింది.

తాను భారతదేశ ఆర్థిక గణాంకాలను క్షుణ్ణంగా విశ్లేషించించానని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మెరుస్తోందనే చర్చలన్నీ నిరాధారమైనవని ఆయన అన్నారు. ఇదే క్రమంలో ఇటీవల ఇక్రా అంచనాల ప్రకారం నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి ఊహించినదాని కంటే అధికంగా ఉందని తేలింది. 2024 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ 6 శాతంగా ఉండవచ్చని ICRA ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ అన్నారు.
జనవరి-మార్చిలో వ్యవసాయ రంగం బాగా పెరిగింది. దాని స్థూల విలువ జోడింపు వృద్ధి మునుపటి త్రైమాసికంలో 4.7 శాతం నుంచి 5.5 శాతానికి పెరిగింది. నిర్మాణ రంగం కూడా FY22లో 14.8 శాతం వృద్ధితో పోలిస్తే FY23లో 10 శాతానికి మందగించింది. 2022-23లో ప్రస్తుత ధరల ప్రకారం నామమాత్రపు GDP రూ.272.41 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా వేయబడింది. ఇదే సమయంలో ఎగుమతులు, దిగుమతులు రెండింటిలో క్షీణత కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications