For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI మినహా అన్ని బ్యాంకుల ప్రైవేటీకరణ..! ప్రభుత్వానికి నివేదించిన ఆర్థికవేత్తలు.. బీజేపీ నిర్ణయం..?

|

Banks Privatisation: దేశంలో స్టేట్ బ్యాంక్ మినహా ఇతర బ్యాంకులన్నీ ప్రైవేటు పరం అవుతాయా? అనే ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రైవేటీకరణ శరవేగంగా పెరిగిపోతోంది. ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం దేశంలోని అనేక బ్యాంకులను ఇతర బ్యాంకుల్లో విలీనం చేసింది.

బ్యాంకుల ప్రైవేటీకరణ..

బ్యాంకుల ప్రైవేటీకరణ..

ఇప్పుడు ప్రభుత్వం త్వరలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే యోచనలో ఉంది. ప్రైవేట్ కంపెనీలకు బ్యాంకులు ఇచ్చేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసింది. మూలాధారాలను విశ్వసిస్తే, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభం కావచ్చు. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ వార్తల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగారు. ప్రభుత్వ ఈ చర్యపై దేశంలోని ఆర్థికవేత్తలు ఎస్‌బిఐ మినహా అన్ని బ్యాంకులను ప్రభుత్వం ప్రైవేట్‌గా మార్చాలని అంటున్నారు.

అన్ని బ్యాంకులను ప్రైవేట్‌గా మార్చాలి..

అన్ని బ్యాంకులను ప్రైవేట్‌గా మార్చాలి..

దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై వ్యతిరేకత మొదలైంది. నిరసనల మధ్య, దేశంలోని ఇద్దరు పెద్ద ఆర్థికవేత్తలు SBI మినహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని అన్నారు. కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌, నీతి ఆయోగ్‌ మాజీ డిప్యూటీ చైర్మన్‌ అరవింద్‌ పనగారియా; ప్రధానమంత్రి ఆర్థిక సలహా బృందం సభ్యురాలు పూనమ్‌ గుప్తా ప్రభుత్వానికి ఈ మేరకు ఇప్పటికే సలహా ఇచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం దేశ ప్రయోజనాల దృష్ట్యా అని ఇండియా పాలసీ ఫోరమ్‌లో సమర్పించిన పాలసీ పేపర్‌లో పనగారియా, గుప్తాలు పేర్కొన్నారు.

అన్ని బ్యాంకుల ప్రైవేటీకరణతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒకే నిబంధనలో అన్నింటిని పర్యవేక్షించగుతుందని వారు అంటున్నారు.

SBIని మాత్రం ప్రైవేట్ చేయకూడదు..

SBIని మాత్రం ప్రైవేట్ చేయకూడదు..

ఇద్దరు ఆర్థికవేత్తల ప్రకారం.. ఆర్థిక, రాజకీయ నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకును తన వద్ద ఉంచుకోవాలన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహా అన్ని బ్యాంకులను ప్రభుత్వం ప్రైవేట్‌గా మార్చాలని నివేదికలో ఇద్దరూ అభిప్రాయాన్ని వెల్లడించారు. అన్ని బ్యాంకుల ప్రైవేటీకరణ తర్వాత.. ఫలితం అనుకూలంగా కనిపిస్తే, ప్రభుత్వం SBIని కూడా ప్రైవేటీకరించాలని సూచించారు. ఆర్థికవేత్తల సూచనలను ప్రభుత్వం పరిగణిస్తోందని సమాచారం.

ప్రభుత్వం ఏమనుకుంటుంది..?

ప్రభుత్వం ఏమనుకుంటుంది..?

ఈ ఏడాది బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐడీబీఐ బ్యాంక్‌తో సహా దేశంలోని రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ గురించి మాట్లాడారు. ప్రైవేటీకరణ కోసం నీతి ఆయోగ్ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా షార్ట్‌లిస్ట్ చేసింది. ప్రతిపక్షాల నుంచి నిరంతరం వ్యతిరేకత ఉన్నప్పటికీ, ప్రభుత్వం మరిన్ని సంస్థలను ప్రైవేటీకరించాలని కోరుకుంటోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ బ్యాంక్ ప్రైవేటీకరణ ఉండవచ్చని తెలుస్తోంది. అన్ని బ్యాంకులు నిజంగా ప్రైవేటీకరణ జరిగితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది విశ్లేషించాల్సి ఉంది.

English summary

SBI మినహా అన్ని బ్యాంకుల ప్రైవేటీకరణ..! ప్రభుత్వానికి నివేదించిన ఆర్థికవేత్తలు.. బీజేపీ నిర్ణయం..? | bjp government at centre looking proposal of privatisation of all banks

bjp government at centre looking proposal of privatisation of all banks except state bank of india ..
Story first published: Saturday, July 16, 2022, 13:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X