IPO News: ఇన్వెస్టర్లను ముంచిన ఐపీవో.. తొలిరోజే నష్టాలు.. లాభాలు గోవిందా..

IPO News: మార్కెట్ల ట్రేడింగ్ చివరి రోజున మార్కెట్లో లిస్ట్ అయ్యింది బిజోటిక్ కమర్షియల్ ఐపీవో. అయితే ఇది ఇన్వెస్టర్ల అంచనాలను తారుమారు చేసి నిరాశకు గురిచేసింది. ఏదో నాలుగు రూపాయలు వస్తాయనుకుంటే మొదటి రోజునే లోయర్ సర్క్యూట్ కొట్టింది.

ఈరోజు మార్కెట్లోకి అడుగు పెట్టిన బిజోటిక్ కమర్షియల్ లిమిటెడ్ మ్యూట్ లిస్టింగ్ ఇన్వెస్టర్ల మూడ్ చెడగొట్టింది. దీంతో అనేక మంది తొలిరోజే షేర్లను విక్రయించటం ప్రారంభించారు. ఆ తర్వాత కంపెనీ షేర్లు తొలిరోజే లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. ఈ కంపెనీ స్టాక్ బీఎస్ఈలో రూ.180 ధరకు లిస్టింగ్ చేయబడింది. ఆ తర్వాత ఇంట్రాడేలో స్టాక్ రూ.182 మార్కును చేరుకున్నప్పటికీ అమ్మకాలతో నష్టాల్లోకి జారుకుంది.

Bizotic commercial limited SME IPO dissapointed investors as shares closed red on day one

అయితే మార్కెట్ల ట్రేడింగ్ ముగిసే సమయానికి కంపెనీ షేర్ ధర రూ.171గా ఉంది. అసలు బిజోటిక్ కమర్షియల్ ఐపీవో ద్వారా రూ.42.21 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం తాజా ఇష్యూ రూపంలో కంపెనీ 24.12 లక్షల షేర్లను జారీ చేసింది. ఇందుకోసం షేరు ప్రైస్ రూ.172గా నిర్ణయించింది. సబ్‌స్క్రిప్షన్ ప్రారంభ రోజున ఐపీవో 37 శాతం సబ్‌స్క్రైబ్ అయి మంచి స్పందనను పొందింది. అయితే ఆ తర్వాత రెండవ రోజు 1.11 సార్లు, మూడవ రోజు 1.29 సార్లు, నాల్గవ రోజు 1.87 సార్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది.

ఈ కంపెనీ వివిధ రకాలైన పురుషుల ఫార్మల్ వేర్, క్యాజువల్ వేర్, పార్టీ వేర్, ఫిట్ వేర్, స్పోర్ట్స్ వేర్, కంఫర్ట్ వేర్, ఎత్నిక్ వేర్, వింటర్ వేర్ వంటి విభిన్న శ్రేణిలో రెడీమేడ్ వస్త్రాల తయారీ, డిజైనింగ్ అండ్ మార్కెటింగ్ వ్యాపారంలో ఉంది. ఇది రిటైల్ స్టోర్లు, ఈ-కామర్స్ ఛానెల్‌ల ద్వారా తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన మొదటి అవుట్‌లెట్‌ను రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో "అర్బన్ UNITED" పేరుతో తన సొంత బ్రాండ్ పేరుతో ప్రారంభించింది.

ఆ తర్వాత రాజస్థాన్, హర్యానాలో మాత్రమే ఫ్రాంఛైజీ ప్రాతిపదికన 40 అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేసింది. అయితే కరోనా మహమ్మారి సమయంలో ప్రతికూల ప్రభావం కారణంగా స్టోర్‌ల అధిక అద్దె ఛార్జీలు చెల్లించలేక ఫ్రాంచైజీ హోల్డర్‌లలో చాలామంది నిలదొక్కుకోలేకపోయారు. దీంతో ఆ సమయంలో అద్దె దుకాణాల్లో స్టోర్లను ఏర్పాటైన దాదాపు 28 ఫ్రాంఛైజ్ స్టోర్‌లు మూసివేయబడ్డాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+