జేపీ మోర్గాన్, వీసా కంటే బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ ఎక్కువ
క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ పుంజుకుంది. గత కొంతకాలంగా ముందుకు సాగుతోన్న బిట్ కాయిన్ నేడు కూడా దాదాపు ఒక శాతం లాభపడింది. ప్రస్తుతం బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ జేపీ మోర్గాన్ చేజ్, వీసా కంటే ఎక్కువగా ఉంది. బిట్ కాయిన్ ప్రస్తుత మార్కెట్ క్యాప్ 1.16 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఓ డేటా ప్రకారం జేపీ మోర్గాన్ చేజ్, వీసా మార్కెట్ క్యాప్ 974.67 బిలియన్ డాలర్లు. ఇందులో జేపీ మోర్గాన్ మార్కెట్ క్యాప్ 503.24 బిలియన్ డాలర్లు, వీసా ఎంక్యాప్ 471.43 బిలియన్ డాలర్లు.
ఇక రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేరియం మార్కెట్ క్యాపిటలైజేషన్ 538.44 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎథేరియం మార్కెట్ క్యాప్ కూడా జేపీ మోర్గాన్ చేజ్ (503.24 బిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ. గత వారం రోజుల్లో టాప్ టెన్ క్రిప్టోల్లో సోలానా ఏకంగా 33 శాతం పెరిగింది. ఆ తర్వాత పోల్కాడాట్ 26 శాతం, బియాన్స్ కాయిన్ 27 శాతం ఎగిసింది. బిట్ కాయిన్ అక్టోబర్ 18న తిరిగి 60,000 డాలర్లకు చేరుకుంది. బిట్ కాయిన్ 2021 క్యాలెండర్ ఏడాదిలో 129 శాతం లాభపడింది. జనవరి 1, 2021న 29,087 డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ ఇప్పుడు 62,000 డాలర్లకు చేరువైంది.

భారత కరెన్సీలో క్రిప్టో వ్యాల్యూ
- Bitcoin - 49,45,272 - 0.83% వృద్ధి
- Ethereum - 3,62,316 - 0.79% వృద్ధి
- Tether - 79.95 - 0.28% క్షీణత
- Cardano - 159.1100 - 1.06% క్షీణత
- Binance Coin - 51,673.62 - 6.65% వృద్ధి
- XRP - 92.0466 - 1.09% క్షీణత
- Polkadot - 4,144.64 - 1.33% వృద్ధి
- Dogecoin - 20.8794 - 0.67% క్షీణత


Click it and Unblock the Notifications