For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాల్లో క్రిప్టో మార్కెట్, ఐనా 30,000 డాలర్ల దిగువనే బిట్ కాయిన్

|

క్రిప్టో మార్కెట్ నేడు లాభాల్లో ఉన్నప్పటికీ, ఇటీవలి కనిష్టాల వద్దనే కనిపిస్తోంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ నేడు దాదాపు మూడు శాతం లాభపడింది. కానీ 30,000 డాలర్లకు దిగువనే ఉంది. బిట్ కాయిన్, ఎథేరియం, బియాన్స్ కాయిన్, ఎక్స్‌ఆర్‌పీ, క్రిప్టో డాట్ కామ్, కార్డానో వంటి క్రిప్టోలు 2 శాతం నుండి 4 శాతం మేర లాభపడ్డాయి. మీమ్ కాయిన్స్ షిబా ఇను, డోజీకాయిన్ దాదాపు 2.5 శాతం ఎగిసిపడ్డాయి.

ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ నేడు 2.80 శాతం లాభపడి 29,722 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 28,641 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 30,181 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. ఇదే కాలంలో బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 566.16 బిలియన్ డాలర్లు పెరిగింది.

Bitcoin up, Binance Coin biggest gainer

వివిధ క్రిప్టో వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 2.80 శాతం, ఎథేరియం 2.46 శాతం, బియాన్స్ కాయిన్ 4.10 శాతం, ఎక్స్‌ఆర్‌పీ 2.57 శాతం, సోలానా 1.51 శాతం, క్రిప్టో డాట్ కామ్ 2.24 శాతం, బియాన్స్ యూఎస్డీ 0.06 శాతం, కార్డానో 3.49 శాతం, స్టెల్లార్ 4.60 శాతం, పోల్కాడాట్ 4.59 శాతం, అవాలాంచె 3.89 శాతం, డోజీకాయిన్ 2.68 శాతం, షిబా ఇను 2.37 శాతం లాభపడ్డాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టెర్రా యూఎస్టీ ఏకంగా 42 శాతం లాభపడింది. టాప్ లూజర్స్ జాబితాలో అల్కెమీ పే 8.8 శాతం నష్టపోయింది.

English summary

లాభాల్లో క్రిప్టో మార్కెట్, ఐనా 30,000 డాలర్ల దిగువనే బిట్ కాయిన్ | Bitcoin up, Binance Coin biggest gainer

The market dominance of world's largest cryptocurrency rose 0.25 percent to 44.46 percent over the last day.
Story first published: Wednesday, May 25, 2022, 20:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X