క్రిప్టోకరెన్సీ కింగ్ బిట్ కాయిన్ ఇటీవల దారుణంగా పతనమవుతోంది. గత నెలలో ఓ సమయంలో 64,000 డాలర్లను క్రాస్ చేసిన ఈ క్రిప్టో ఇప్పుడు 45,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇటీవలి కాలంలో బిట్ కాయిన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద కూడా కరిగిపోయింది. అంతేకాదు, టెస్లా ఇంక్ ఇటీవల కొనుగోలు చేసిన క్రిప్టోకరెన్సీని విక్రయించనున్నట్లు తెలిపింది. దీంతో బిట్ కాయిన్ వ్యాల్యూ పడిపోయింది. దాదాపు మూడు నెలల తర్వాత బిట్ కాయిన్ 45వేల డాలర్ల దిగువకు పడిపోయింది.
టెస్లా ఇంక్ కొద్ది నెలల క్రితం క్రిప్టోకరెన్సీ బిటా కాయిన్‌లో 1.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. అప్పటి నుండి బిట్ కాయిన్ రికార్డ్ స్థాయి 64వేలు దాటింది. అయితే ఎలాన్ మస్క్ కొద్ది రోజుల క్రితం డోజికాయిన్‌కు అనుకూలంగా ట్వీట్ చేశారు. ఆ సమయం నుండి బిట్ కాయిన్ పతనం ప్రారంభమైంది. తాజాగా టెస్లా ఇంక్ తన క్రిప్టో హోల్డింగ్స్ విక్రయిస్తుందనే వార్తల నేపథ్యంలో బిట్ కాయిన్ మరింత పడిపోయింది. ఏకంగా 45వేల డాలర్ల దిగువకు చేరుకుంది. ఆ తర్వాత అతి స్వల్పంగా కోలుకొని 45,270 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత శుక్రవారంతో పోలిస్తే బిట్ కాయిన్ 4వేల డాలర్లు పడిపోయింది.

కాగా, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడి జాబితాలో మూడో స్థానానికి పడిపోయాడు. చాలా కాలంగా ఆయన నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. టెస్లా షేర్స్ భారీగా ఎగిసినప్పుడు ఓ సమయంలో ఆయన కొద్ది సమయం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ను దాటి మొదటి స్థానంలోకి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎంతోకాలంగా నెంబర్ టూ స్థానంలో ఉంటున్నారు. ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయాడు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications