క్రిప్టో కరెన్సీ భారీగా పతనమైంది. గత కొద్ది రోజులుగా 40,000 డాలర్లకు పైనే ట్రేడ్ అవుతున్న క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ నేడు మాత్రం ఈ మార్కు దిగువకు పడిపోయింది. ఈ వార్త రాసే సమయానికి అతి కొద్దిగా పుంజుకొని 40,300 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యం, అమెరికాతో చర్చలకు సన్నద్ధం వంటి అంశాలు అంతర్జాతీయ, జాతీయ మార్కెట్ పైన ప్రభావం చూపుతాయి.
అయితే అంతర్జాతీయ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ జనవరి తర్వాత మొదటిసారి భారీగా పడిపోయింది. బిట్ కాయిన్ నేడు 5 శాతం కంటే పైగా పతనమైంది. ఈ వార్త రాసే సమయానికి 5.03 శాతం క్షీణించి 39,880.55 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో గరిష్టం 42,135 డాలర్లు, కనిష్టం 39,661 డాలర్లు. గత ఇరవై నాలుగు గంటల్లో క్షీణించిన మార్కెట్ క్యాప్ 756.18 బిలియన్ డాలర్లు. బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టం 68,990.90 డాలర్లు కాగా, కనిష్టం 28,825.76 డాలర్లు.

ఇతర క్రిప్టో కరెన్సీల విషయానికి వస్తే ఎథేరియం 5.78 శాతం క్షీణించి 2,812 డాలర్ల వద్ద, ఎక్స్‌పీఆర్ 4.04 శాతం క్షీణించి 0.77 డాలర్ల వద్ద, సోలానా 6.20 శాతం క్షీణించి 91.36 డాలర్ల వద్ద, టెర్రా 8.50 శాతం క్షీణించి 49.75 డాలర్ల వద్ద, అవాలాంచె 8.05 శాతం క్షీణించి 83.82 డాలర్ల వద్ద, కార్డానో 4.41 శాతం క్షీణించి 1.01 డాలర్ల వద్ద, స్టెల్లార్ 5.74 శాతం క్షీణించి 0.200000 డాలర్ల వద్ద, పోల్కాడాట్ 3.78 శాతం క్షీణించి 17.90 డాలర్ల వద్ద, డోజీకాయీన్ 3.72 శాతం క్షీణించి 0.138 డాలర్ల వద్ద, షిబా ఇను 5.48 శాతం క్షీణించి 0.00028 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications