Bitcoin: అప్పట్లో మార్కెట్లను ఓ ఊపు ఊపింది బిట్ కాయిన్. అంటే ఏంటో తెలియని వారు కూడా అధిక లాభాలు వస్తాయనే నమ్మకంతో పెట్టుబడి పెట్టి నట్టేట మునిగారు. అయితే భారత ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో వాటిలో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య కొంత మేర తగ్గింది. కానీ ఇప్పటికీ పెద్దమొత్తంలో పెట్టుబడులు పెడుతున్న వారు లేకపోలేదు.
ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండవచ్చనే అంచనాల నడుమ ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ రెండేళ్లలో మొదటిసారి 50 వేల డాలర్ల మార్కుని టచ్ చేసింది. దాని ధరను ట్రాక్ చేయడానికి రూపొందించిన US ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్‌లకు గత నెలలో రెగ్యులేటరీ ఆమోదం తెలపడమూ ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

2024 ప్రారంభం నుంచి ఇప్పటివరకు క్రిప్టోకరెన్సీ 16.3 శాతం పెరిగింది. డిసెంబర్ 27, 2021 నుంచి చూస్తే సోమవారం అత్యధిక స్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం 12:56 EST సమయానికి బిట్‌కాయిన్ 50 వేల డాలర్ల స్థాయికి చేరుకోవడంతో నిన్న 4.96 శాతం పెరిగి చివరికి 49,899 వద్ద స్థిరపడింది. ఇక రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఈథర్ ధర 4.12 శాతం పెరిగి 2 వేల 607 డాలర్ల వద్ద ఉంది.
'గత నెలలో స్పాట్ ETFలను ప్రారంభించిన తర్వాత బిట్‌కాయిన్‌కు 50 వేల డాలర్లు ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ కీలక స్థాయి వద్ద నిలబడలేక విఫలమవ్వడమే కాకుండా 20 శాతం అమ్మకాలు జరిగాయి' అని క్రిప్టో లెండింగ్ ప్లాట్‌ఫారమ్ నెక్సో సహ వ్యవస్థాపకులు ఆంటోని ట్రెంచెవ్ తెలిపారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications