బంగారం వదిలేసి బిట్‌కాయిన్ మీద పడిన పెట్టుబడిదారులు..చరిత్రలో తొలిసారిగా రూ.1 కోటికి చేరిన ధర

Bitcoin surges to record high: ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది..అలాగే అత్యంత డిమాండ్ కలిగిన అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ మరోసారి తన శక్తిని చూపించింది. బుధవారం నాడు రికార్డు స్థాయి పెరుగుదలతో దూసుకుపోయింది. డిజిటల్ ఆస్తులపై పెరుగుతున్న విశ్వాసంతో పాటు పెద్ద ఆర్థిక సంస్థల మద్దతుతో బిట్ కాయిన్ ధరలు నింగిని తాకుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించబడే డిజిటల్ కరెన్సీపై పెట్టుబడిదారులువ విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం బిట్ కాయిన్ ధర 111,988.90 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.95,88,993)కి చేరింది.

దూసుకొస్తున్న ఆర్థికమాంధ్య భయాల మధ్య క్రిప్టోకరెన్సీ అత్యంత సురక్షితమైన డిజిటల్ కరెన్సీగా మారింది. దీంతో ఇన్వెస్లర్లు దీనిపై మక్కువ పెంచుకుంటున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ ధర 111,988.90 డాలర్లని తాకగా, చివరిసారిగా 111,259 డాలర్ల వద్ద 0.4 శాతం పెరుగుదలతో ట్రేడవుతోంది. 2025 ఆరంభం నుంచి ఇప్పటి వరకూ బిట్‌కాయిన్ 18 శాతం వృద్ధిని సాధించింది. ఈ ఏడాది అత్యుత్తమ ప్రతిభ చూపుతున్న ఆస్తులలో ఒకటిగా బిట్ కాయిన్ నిలిచింది.

Bitcoin latest news Bitcoin price surge Bitcoin record high Bitcoin nears 112000 cryptocurrency market crypto news Bitcoin rally digital currency blockchain news crypto investment Bitcoin trading Bitcoin all-time high Bitcoin price today Bitcoin market update 112000 cryptocurrency Bitcoin

ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ప్రొఫెషనల్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ సీఈఓ ఆంథనీ పోంప్లియానో మాట్లాడుతూ.. బిట్‌కాయిన్ మార్కెట్ వృద్ధి చెందుతున్న కొద్దీ అది మరింత సురక్షితమైన పెట్టుబడిగా మారుతోందని అన్నారు. ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను దాటి ఉండటం వల్ల పెద్ద ఆర్థిక సంస్థలు కూడా ఇప్పుడు ఈ రంగంలో ప్రవేశిస్తున్నాయని చెబుతున్నారు.అయితే ఇప్పటిదాకా డిజిటల్ కరెన్సీలకు దూరంగా ఉన్న ప్రముఖ సంస్థలు ఇప్పుడు బిట్‌కాయిన్ లాంటి ఆస్తులను కొనుగోలు చేస్తుండటంతోదాని ధరలు మరింత ఎగబాకుతున్నాయి.

ఈ ఏడాది జూన్‌లో జరిగిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి సంబంధించిన వివరాల వెలువడిన తర్వాత మార్కెట్లలో రిస్క్ తో కూడిన సెంటిమెంట్ పెరిగింది. 2025లో కనీసం ఒక్కసారి వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని పలువురు పాలసీమేకర్లు సూచించడం వల్ల పెట్టుబడిదారుల్లో ఉత్సాహం పెరిగింది.

ముద్రెక్స్ అనే క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ సీఈఓ ఎడుల్ పాటెల్ ప్రకారం..ఫెడ్ అప్‌డేట్ తర్వాత బిట్‌కాయిన్ కీలక రెసిస్టెన్స్ లెవల్స్‌ను అధిగమించి సరికొత్త గరిష్టాన్ని 112,022 డాలర్ల వద్ద నమోదు చేసుకుంది. అమెరికా డాలర్ బలహీనపడటం కూడా బిట్‌కాయిన్‌కు మద్దతిచ్చే అంశంగా నిలిచింది.బిట్‌కాయిన్ ప్రస్తుతం 111,300 డాలర్లను దాటి ట్రేడవుతోంది. ఈ జోరు కొనసాగితే ధరలు కొత్త రికార్డును నెలకొల్పే అవకాశం ఉంది. అయితే జూలై 11న విడుదలయ్యే అమెరికా ద్రవ్యోల్బణ (CPI) డేటా, ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయంపై ట్రేడర్లు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.

అగ్రరాజ్యం అమెరికా రాజకీయ పరిస్థితుల్లో నెలకొన్న క్రిప్టో అనుకూల ధోరణి కూడా బిట్‌కాయిన్‌కు బలాన్ని ఇచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ పాలన క్రిప్టో ఫ్రెండ్లీ గా మారుతుండటంతో ట్రేడర్లు మరింత ధైర్యంగా పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్ తాజాగా క్రిప్టో ETF ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ETF బిట్‌కాయిన్, ఈథర్, సోలానా, రిపుల్ వంటి క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడి పెట్టనుంది.

బిట్‌కాయిన్ ర్యాలీతో ఇతర డిజిటల్ ఆస్తులు కూడా లాభపడుతున్నాయి. ఈథర్ 2,794.95 డాలర్ల వద్ద నెలవారీ గరిష్టాన్ని నమోదు చేసింది. క్రిప్టోకు అనుబంధ స్టాక్స్ కూడా మెరుగైన పనితీరును కనబర్చాయి. మైఖేల్ సేలర్ స్థాపించిన స్ట్రాటజీ కంపెనీ 4.7 శాతం పెరిగింది. కోయిన్‌బేస్ గ్లోబల్ 5.4% వృద్ధిని సాధించింది. ప్రస్తుతం డిజిటల్ ఆస్తులను సంపద నిల్వలుగా భావించే దిశగా ప్రజలు దృష్టిని మళ్లిస్తున్నారు.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+