భారీ జంప్, 45,000 డాలర్లకు చేరుకున్న బిట్ కాయిన్
క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ గతవారం 44,000 డాలర్ల పైన ముగిసింది. అంతకుముందు ఓ సమయంలో 30,000 డాలర్ల దిగువన ముగిసిన బిట్ కాయిన్ ఇటీవల ఎలాన్ మస్క్ వ్యాఖ్యల అనంతరం కాస్త పైపైకి చేరుకుంటోంది. ఈ వారం ప్రారంభంలో 40,000 డాలర్ల పైకి చేరుకున్న బిట్ కాయిన్, ఆ తర్వాత క్షీణించింది. అయితే మళ్లీ పైకి లేచింది. దీంతో చివరి సెషన్‌లో 44,124 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మిడిల్ మే నెల నుండి ఇదే గరిష్టం. బిట్ కాయిన్ ఓ సమయంలో 45,000 డాలర్లను కూడా తాకింది.
వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ...
- Bitcoin BTC ధర $45,206.73 కాగా, ఇరవై నాలుగు గంటల్లో 4.88% లాభపడింది. వారం రోజుల్లో 8.27% ఎగిసిపడింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $848,081,975,368గా ఉంది.
- ఎథేరియం వ్యాల్యూ 3,178.53 డాలర్లుగా ఉంది. 24 గంటల్లో 7.71 శాతం, ఏడు రోజుల్లో 22 శాతం ఎగిసిపడింది.

- టెథేర్ 1.00 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 0.02 శాతం, ఏడు రోజుల్లో 0.04 శాతం ఎగిసిపడింది.
- బియాన్స్ కాయిన్ 359.19 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 3.44 శాతం, ఏడు రోజుల్లో 4.13 శాతం ఎగిసిపడింది.
- కార్డానో 1.49 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 4.61 శాతం, ఏడు రోజుల్లో 8.94 శాతం ఎగిసిపడింది.
- డోజీకాయిన్ 0.27 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 27.70 శాతం, ఏడు రోజుల్లో 27.10 శాతం ఎగిసిపడింది.
- యూఎస్‌డీ కాయిన్ 1.00 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో మైనస్ 0.01 శాతం, ఏడు రోజుల్లో 0.00 శాతం మాత్రమే కదలాడింది.
- పోల్కాడాట్ 21.02 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. యూనిస్వాప్ 28.52 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications