బిట్ కాయిన్ సహా వివిధ క్రిప్టో కరెన్సీలు ఈ వారం భారీగా పడిపోయాయి. బిట్ కాయిన్, ఇతర డిజిటల్ కరెన్సీలతో కూడిన ట్రాన్సాక్షన్స్ చట్టవిరుద్దమని చైనా కేంద్ర బ్యాంకు శుక్రవారం ప్రకటించింది. డిజిటల్ కరెన్సీ అనధికార వినియోగాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. క్రిప్టో కరెన్సీలను నిర్వహించకుండా 2013లోనే చైనా బ్యాంకులపై నిషేధం విధించారు. కానీ ప్రభుత్వం ఈ ఏడాది మళ్లీ ప్రకటన చేసింది. ఈ ప్రభావం క్రిప్టో కరెన్సీ పైన పడింది.
గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంతకుముందు సెషన్తో పోలిస్తే చివరి సెషన్లో 4.23 శాతం క్షీణించ 1.91 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది. క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 24 గంటల్లో 134.58 బిలియన్ డాలర్లుగా నమోదయింది. బిట్ కాయిన్ ధర ప్రస్తుతం 42,574.50 డాలర్లు (రూ.31,40,977.43 ) వద్ద ఉంది. క్రిప్టో మార్కెట్లో బిట్ కాయిన్ వాటా 42.04 శాతంగా ఉంది. అంతకుముందు సెషన్తో పోలిస్తే బిట్ కాయిన్ మార్కెట్ వాటా 0.08 శాతం క్షీణించింది.

చైనా కేంద్ర బ్యాంకు ప్రకటన తర్వాత గంటలోనే బిట్ కాయిన్ వ్యాల్యూ నాలుగు శాతం మేర పడిపోయింది. బిట్ కాయిన్, ఎథేరియం, ఇతర డిజిటల్ కరెన్సీలు ఫైనాన్షియల్ సిస్టంకు అంతరాయం కలిగిస్తున్నాయని, అలాగే, మనీలాండరింగ్, ఇతర నేరాలలో ఉపయోగించబడుతున్నట్లు పేర్కొంది చైనీస్ బ్యాంకు. వర్చువల్ కరెన్సీ డెరివేటివ్ ట్రాన్సాక్షన్స్ అన్నింటిని చట్టవిరుద్ధమైన ఆర్థిక కార్యకలాపాలు అని, వీటిని నిషేధిస్తున్నట్లు తెలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications